Home Actor హ్యాపీ బ‌ర్త్ డే… మెగా ప‌వ‌ర్ స్టార్..!

హ్యాపీ బ‌ర్త్ డే… మెగా ప‌వ‌ర్ స్టార్..!

85
0


మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్..

చిరుత సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిరుత అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మెగాస్టార్ వార‌సుడు రామ్ చ‌ర‌ణ్ కి తొలి విజ‌యాన్ని అందించింది. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ల‌లో సూప‌ర్ అనేలా న‌టించి తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నాడు. ఆత‌ర్వాత చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం మ‌గ‌ధీర‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌గ‌ధీర చిత్రం అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డులు అన్నింటిని చెరిపేసి స‌రికొత్త రికార్డులు సృష్టించి చ‌రిత్ర సృష్టించింది.

ఆత‌ర్వాత ఆరెంజ్, ర‌చ్చ‌, నాయ‌క్, ఎవ‌డు, గోవిందుడు అంద‌రివాడేలే, బ్రూస్ లీ, ధృవ చిత్రాల్లో న‌టించి మెప్పించారు. అయితే…స‌క్స‌స్ లు సాధించాడు కానీ…అత‌నిలో ఉన్న న‌టుడు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. మెగాస్టార్ త‌న‌యుడు కాబ‌ట్టే ఈ స‌క్స‌స్ లు వ‌చ్చాయి అనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అలా వ‌చ్చిన విమ‌ర్శ‌లు అన్నింటికి ఒకే ఒక్క సినిమాతో  స‌మాధానం చెప్పాడు. అదే రంగ‌స్థ‌లం. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్ర‌తో మెప్పించి..ఎలాంటి పాత్ర‌నైనా అద్భుతంగా పోషించ‌గ‌ల‌ని నిరూపించారు చ‌ర‌ణ్.

రామ్ చ‌ర‌ణ్ లోని న‌టుడిని బ‌య‌ట‌కు తీసిన ఘ‌న‌త‌ సుకుమాకే ద‌క్కుతుంది. ఈ సినిమాలో చ‌ర‌ణ్ కాకుండా చిట్టిబాబు పాత్రే క‌నిపిస్తుంది. అందుకే జ‌నాలు చిట్టిబాబుకు జేజేలు కొట్టారు. సంచ‌ల‌న విజ‌యాన్ని అందించారు. రంగ‌స్థ‌లం త‌ర్వాత చ‌ర‌ణ్ చేసిన చిత్రం విన‌య విధేయ రామ‌. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. దీనికి ద‌ర్శ‌కుడు బోయ‌పాటే కార‌ణం అన్నారు కానీ.. చ‌ర‌ణ్ స‌రిగా న‌టించ‌లేద‌ని అన‌లేదు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ..కెరీర్ లో దూసుకెళుతూ..మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుకుంటూ హ్యాపీ బ‌ర్త్ డే టు మెగా ప‌వ‌ర్ స్టార్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here