Home Movie News హ‌రికృష్ణ మ‌ర‌ణం జీర్ణించుకోలేక‌పోతున్న నాగార్జున‌..!

హ‌రికృష్ణ మ‌ర‌ణం జీర్ణించుకోలేక‌పోతున్న నాగార్జున‌..!

99
0
Nandamuri Harikrishna - Nagarjuna

ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ వార‌సులైన హ‌రికృష్ణ‌, నాగార్జున మ‌ధ్య ప్ర‌త్యేక‌మైన అనుబంధం. వీరిద్ద‌రు క‌లిసి సీతారామ‌రాజు సినిమాలో అన్న‌ద‌మ్ములుగా న‌టించారు. ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని విజ‌యం సాధించి ఇద్ద‌రికి మంచి జ్ఞాప‌కాన్ని అందించింది. రీల్ లైఫ్ లోనే కాదు రియ‌ల్ లైఫ్ లో కూడా..వీరిద్ద‌రు అన్న‌ద‌మ్ములే. నాగార్జున..హ‌రికృష్ణని అన్న‌య్యని పిలుస్తారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నాగార్జునే మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు పొగ్రామ్ లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ తో ఓసారి చెప్పారు.

ఈరోజు నాగార్జున పుట్టిన‌రోజు. అయితే..ఇటీవ‌ల నాగార్జున సీనియ‌ర్ అభిమాని, స్నేహితుడు పి.ర‌వీంద‌ర్ రెడ్డి మ‌ర‌ణించ‌డంతో బాగా డిస్ట్ర‌బ్ అయ్యారు. ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేదు. ఇంత‌లో హ‌రికృష్ణ మ‌ర‌ణించార‌నే వార్త తెలియ‌డంతో జీర్ణించుకోలేపోయారు. పుట్టిన‌రోజు వేడుక‌లు ర‌ద్దు చేసారు. ట్విట్ట‌ర్ లో నాగార్జున స్పందిస్తూ…చాలా రోజులు అయ్యింది నిన్ను చూసి. క‌ల‌వాలి త‌మ్ముడు అని హ‌రికృష్ణ ఇటీవ‌ల ఫోన్ చేసి మాట్లాడారు. ఇంత‌లోనే వెళ్లిపోయారు. ఈ వార్త‌ను జీర్ణించుకోలేక‌పోతున్నాను అంటూ త‌న బాధ‌ను వ్య‌క్తం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here