Home Political News హ‌రీష్ రావుకు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌న్నూరి న‌ర్సిరెడ్డి  బ‌హిరంగ లేఖ‌.

హ‌రీష్ రావుకు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌న్నూరి న‌ర్సిరెడ్డి  బ‌హిరంగ లేఖ‌.

112
0
maxresdefault

త‌న్నీరు హ‌రీష్ రావు గారికి..

మంత్రి హ‌రీష్ రావు గారు కోదండ‌రామ్ గారికి లేఖ రాస్తూ..తెలుగుదేశం పార్టీ తెలంగాణ వ్య‌తిరేక పార్టీ అని కోదండ‌రామ్ గారే జేఏసీ నుంచి టీడీపీని బ‌హిష్క‌రించిన‌ట్టు మీరు చెబుతున్న అబ‌ద్దానికి స్పందిస్తూ వాస్త‌వాలు చెప్ప‌డానికి ఈ బ‌హిరంగ లేఖ రాస్తున్నాను. మీ మామ కేసీఆర్ ఆదేశాల మేర‌కు జేఏసీ నుంచి టీడీపీని కోదండ‌రామ్ బ‌హిష్క‌రించారు. మీరు లేఖ‌లు రాయాల్సింది కాంగ్రెస్ పార్టికో, కోదండరామ్ గారికో, తెలుగుదేశం పార్టీకో కాదు. మీరు అధికారంలోకి వ‌చ్చాకా ఈ నాలుగున్న‌రేళ్ల పాల‌నలో తెలంగాణ ప్ర‌జానీకానికి చేసిన ద్రోహానికి ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెబుతూ లేఖ రాయండి.

* హ‌రీష్ రావు గారు..మీరు చెప్పిన‌ట్లే కోదండ‌రామ్ గారిని నాడు, నేడు నెత్తిన పెట్టుకుని తెలంగాణ స‌మాజం మోస్తుంది.

* తెలంగాణ వ్య‌తిరేక శ‌క్తుల‌తో కోదండ‌రామ్ చేతులు క‌ల‌ప‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల మ‌న‌స్సు గాయ‌ప‌డింద‌ని లేఖ రాసిన హ‌రీష్ రావు ప్ర‌జ‌ల మ‌నస్సు గాయ‌ప‌డింది తెలంగాణ ద్రోహుల‌ను ఉద్య‌మ ద్రోహుల‌ను మీ పార్టీలో చేర్చుకుని ప‌ద‌వులు ఇచ్చి మీ ప‌క్క‌న కూర్చోబెట్టుకున్నందుకు.

* కోదండ‌రామ్ ల‌క్ష్యం ఏమిటో అర్ధం కావ‌డం లేద‌ని..లేఖ రాసిన హ‌రీష్ రావు కోదండ‌రామ్ ల‌క్ష్యం చాలా స్ప‌ష్టంగా ఉంది. తెలంగాణ‌కు వాచ్ డాగ్ గా ఉంటాన‌న్నారు. ఇప్పుడు అదే ప‌ని చేస్తున్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వం త‌ప్పులు చేస్తే మీరు చెప్పండంటూ మాట్లాడుతున్నారు. ఏ రోజైనా కోదండ‌రామ్ గారికి అపాయింట్ మెంట్ ఇచ్చారా..?  తెలంగాణ‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వారి అభిప్రాయాల‌ను తీసుకున్న చ‌రిత్ర మీకు ఉందా..?   నిరుద్యోగుల త‌రుపున నిర‌స‌న తెల‌ప‌డానికి ప్ర‌య‌త్నిస్తే అర్ధ‌రాత్రి త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి భ‌య‌భాంత్రుల‌కు గురి చేయ‌డం ఉద్య‌మ స్పూర్తేనా..?

* జేఏసీ నుంచి కాంగ్రెస్ వెళ్లిపోయింద‌ని చెబుతున్న హ‌రీష్ రావు జేఏసీ అనుమ‌తి లేకుండానే జేసీసీ ఏమైనా శిలా శాస‌న‌మంటూ మీ మామ కేసీఆర్ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి జేఏసీని అవ‌మానించిన విష‌యం వాస్త‌వం కాదా..?

* కోదండ‌రామ్ కొన్ని సార్లు మీకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని జిల్లా జేఏసీ అధ్య‌క్షుల‌తో ర‌హ‌స్య స‌మావేశం పెట్టి కోదండ‌రామ్ గారిని ఛైర్మెన్ ప‌ద‌వి నుంచి దించివేయాల‌ని ప్ర‌య‌త్నించిన విష‌యం వాస్త‌వం కాదా..?

* తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి 2014 ఎన్నిక‌ల్లో 15 అసెంబ్లీ స్ధానాలు ఒక పార్లమెంటు స్ధానం, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో 22శాతంతో అనేక స్ధానాల్లో రెండో స్ధానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ల‌క్ష‌ల మంది స‌భ్య‌త్వం క‌లిగి ఉండి ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్న పార్టీ పైన తెలంగాణ వ్య‌తిరేక ముద్ర వేయాల‌నే నీ ఆరాటానికి తెలంగాణ ప్ర‌జ‌లే స‌మాధానం చెబుతారు.

*తెలంగాణ‌లో విప‌క్షాల‌కు చెందిన ఎమ్మెల్యేల‌ను అంగ‌ట్లో ప‌శువుల మాదిరిగా కొని తెలంగాణ అస్ధిత్వాన్ని దెబ్బ‌తీసిన మీరే కోదండ‌రామ్ కి లేఖ‌లు రాస్తూ నీతులు చెబుతారా..?

* అమ‌రుడు శ్రీకాంతాచారి త‌ల్లి శంక‌ర‌మ్మ‌ను కాద‌ని ఉద్య‌మ ద్రోహి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెడితే అమ‌రుల ఆత్మ ఘోషించ‌దా..?   తెలంగాణ కేబినెట్ లో అంతా తెలంగాణ ద్రోహులే ఉన్నార‌ని హోంమంత్రి నాయిని బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన‌ప్పుడు ఎప్పుడైనా ఆత్మ విమ‌ర్శ చేసుకున్నారా..?

* తెలంగాణ రాష్ట్రంలో ఎన్ కౌంట‌ర్లే ఉండ‌వ‌ని శృతి, సాగ‌ర్ ల‌ను ఎన్ కౌంట‌ర్ చేసిన విష‌యం వాస్త‌వం కాదా..?

* స్వ‌యంపాల‌న ప‌రాయుల‌కు అప్ప‌గిస్తారని మాట్లాడే మీరు స్వ‌యం పాల‌న ముసుగులో కేసీఆర్ కుటుంబ‌మే గ‌ఢీల పాల‌న సాగిస్తుంద‌న్న విష‌యం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలియ‌దా..?

* తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం త‌ర్వాతే ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయ చైత‌న్యం, బ‌డుగుల‌కు రాజ‌కీయ జీవితం వ‌చ్చింది. తెలంగాణ‌లో 85 శాతం ఉన్న బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు మీ క్యాబినెట్ లో వారికి ఇచ్చిన వాటా ఎంతో ఒక్క‌సారి గుర్తు చేసుకోండి.

* తెలుగుదేశం పార్టీ బ‌ల‌ప‌డితే గ‌ఢీల పాల‌న అంతం అవుతుంద‌నే భ‌యంతోనే మామ మాట‌ల‌తో, అల్లుడు లేఖ‌ల‌తో యుద్ధం ప్ర‌క‌టించిన‌ట్లు క‌న్పిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here