Home Movie Reviews హ‌లో గురు ప్రేమ కోస‌మే రివ్యూ..!

హ‌లో గురు ప్రేమ కోస‌మే రివ్యూ..!

194
0

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ – స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ న‌క్కిన త్రినాధ‌రావు కాంబినేష‌న్ లో రూపొందిన రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ హలో గురు ప్రేమ కోస‌మే. రామ్ – అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు. సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ చిత్రాల‌తో న‌క్కిన త్రినాధ‌రావు వ‌రుసగా విజ‌యాలు సాధించి మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు. దీంతో హ‌లో గురు ప్రేమ కోస‌మే చిత్రం పై ఫ‌స్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. ఈ మూవీ ద‌స‌రా కానుక‌గా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. మ‌రి…స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తోన్న రామ్ కి హ‌లో గురు ప్రేమ కోస‌మే విజ‌యాన్ని అందించిందా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – సంజు (రామ్) కాకినాడ‌లో ఉండే అల్ల‌రి అబ్బాయి. పేరెంట్స్ & ఫ్రెండ్సే అత‌ని ప్ర‌పంచం. అయితే..సంజు మావ‌య్య (పోసాని) హైద‌రాబాద్ లో ఉద్యోగం ఇప్పిస్తాను. నువ్వు ఉద్యోగం చేస్తే అమ్మ‌నాన్న ఆనందిస్తార‌ని చెబితే స‌రే..అంటాడు. సంజు త‌ల్లి (సితార‌) హైద‌రాబాద్ లో త‌న ఫ్రెండ్ విశ్వ‌నాథ్ (ప్ర‌కాష్ రాజ్) ఇంట్లో ఉండ‌మ‌ని చెబుతుంది. సంజుకి ఇష్టం లేక‌పోయినా త‌ల్లి మాట కాద‌న‌లేక ఓకే అంటాడు. హైద‌రాబాద్ వెళుతున్న‌ప్పుడు ట్రైన్ లో అను (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్) ప‌రిచ‌యం అవుతుంది. వీరిద్ద‌రి మ‌ధ్య చిన్న గొడ‌వ జ‌రుగుతుంది. ఆత‌ర్వాత సంజుకి.. విశ్వ‌నాధ్ కూతురే అను అని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే..ఆఫీస్ లో సంజుకి రీతు (ప్ర‌ణీత‌) పరిచ‌యం అవుతుంది. రీతు, సంజుని ల‌వ్ చేస్తున్నాన‌ని చెబుతుంది. స‌రిగ్గా ఆ స‌మ‌యంలోనే సంజు..అనుని ప్రేమిస్తున్నాని తెలుసుకుంటాడు. ఇదే విష‌యం రీతుకి చెప్పేస్తాడు. అయితే..విశ్వ‌నాధ్ అనుకి మ్యారేజ్ ఫిక్స్ చేస్తాడు. సంజు, విశ్వ‌నాథ్ ఫ్రెండ్స్ అవుతారు. త‌న ఫ్రెండ్ అయిన విశ్వ‌నాథ్ కి అనుని ప్రేమిస్తున్న విష‌యాన్ని సంజు చెబుతాడు. ఆత‌ర్వాత ఏం జ‌రిగింది..?  అను ఎలా రియాక్డ్ అయ్యింది..?  విశ్వ‌నాథ్ ఎలా రియాక్ట్ అయ్యాడు..?  చివ‌రికి ఏం జరిగింది అనేదే క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

రామ్, ప్ర‌కాష్ రాజ్ న‌ట‌న‌

కామెడీ

డైలాగ్స్

మైన‌స్ పాయింట్స్

రొటీన్ స్టోరీ

కొన్ని బోరింగ్ సీన్స్

విశ్లేష‌ణ –  రామ్ ఎన‌ర్జిటిక్ ఫెర్ ఫార్మెన్స్, సంద‌ర్భానుసారంగా సంభాష‌ణ‌లు బాగానే ఉన్నాయి. కామెడీ కూడా బాగానే ఉంది. రామ్, ప్ర‌కాష్ రాజ్ పై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు కొన్ని బాగానే ఉన్నా..కొన్ని సీన్స్ మాత్రం సిల్లీగా అనిపిస్తాయి. ఈ సినిమా చూస్తుంటే… ప్రేక్ష‌కుల‌కు రావ‌ద్ద‌న్న స‌రే..కొన్ని సినిమాలు గుర్తొస్తుంటాయి. ఇక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టు చ‌క్క‌గా న‌టించింది. ప్ర‌ణీత పాత్ర నిడివి త‌క్కువే అయిన‌ప్ప‌టికీ.. ప‌రిధి మేర‌కు న‌టించింది. ఏ పాత్ర అయినా అవ‌లీల‌గా న‌టించి మెప్పించ గ‌ల విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఓ అమ్మాయి తండ్రిగా విశ్వ‌నాధ్ పాత్ర‌లో చాలా చ‌క్క‌గా న‌టించాడు.

ఆమ‌ని, సితార‌, షాయాజీ షిండే, పోసాని, ప్ర‌వీణ్..త‌దిత‌రులు పాత్ర‌కు త‌గ్గ‌ట్టు న‌టించారు. దేవిశ్రీ మ్యూజిక్ ఫ‌ర‌వాలేద‌నిపించింది. విజ‌య్ కే చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఈ సినిమాకి త‌గ్గ‌ట్టు ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే..మామ అల్లుడు కాన్సెప్ట్ తో తెర‌కెక్కించిన సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ సినిమాలు స‌క్స్ అవ్వ‌డంతో ఈసారి కూడా అదే కాన్సెప్ట్ ని న‌మ్ముకున్నారు డైరెక్ట‌ర్ త్రినాధ‌రావు. కానీ…రొటీన్ స్టోరీ కావ‌డం.. ఇందులో ఎమోష‌న్ అనేది మిస్ అవ్వ‌డంతో కొత్త‌ద‌నం ఏదో ఉంటుంద‌ని సినిమాకి వెళితే నిరాశే. కొత్త‌ద‌నం కోసం ఆలోచించ‌కుండా స‌ర‌దాగా టైమ్ పాస్ చేద్దాం అనుకుంటే హాయిగా చూసి ఎంజాయ్ చేయ‌చ్చు.

రేటింగ్ – 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here