Home Actor 1 మిలియ‌న్ క్రాస్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బేబి.

1 మిలియ‌న్ క్రాస్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బేబి.

45
0
1 మిలియ‌న్ క్రాస్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బేబి. spiceandhra

స‌మంత అక్కినేని న‌టించిన తాజా చిత్రం ఓ.. బేబి. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సెన్సేష‌న‌ల్ మూవీ ఈ నెల 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి, రాజేంద్ర‌ప్ర‌సాద్, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యు.ఎస్ లో సైతం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది.

ఈ వీకెండ్ క‌లెక్ష‌న్స్ తో యు.ఎస్ లో 1 మిలియ‌న్ మార్క్ ను క్రాస్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. స్టార్ హీరోల సినిమాలు 1 మిలియ‌న్ మార్క్ క్రాస్ చేస్తుంటాయి. అయిన‌ప్ప‌టికీ.. కొంత మంది హీరోలు 1 మిలియ‌న్ మార్క్ అందుకోవ‌డానికి చాలా కాలం వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. అలాంటిది లేడీ ఓరియంటెడ్ మూవీ ఓ.. బేబి 1 మిలియ‌న్ మార్క్ క్రాస్ చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

ఈ  క్రేజీ మూవీని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ టీమ్ ఓ మంచి సినిమాని అందించాల‌నే స‌దుద్దేశ్యంతో ఓ.. బేబి చిత్రాన్ని నిర్మించాయి. ఇలా ఎంతో ఇష్టంతో చేసారు కాబ‌ట్టే.. బేబి అంద‌రి ఆద‌ర‌ణ పొందుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here