Home News ఈసారి ఖ‌చ్చితంగా ఆ ప‌ని చేస్తాను – తెనాలి జ‌న‌సేన అభ్య‌ర్థి నాదెండ్ల మ‌నోహ‌ర్

ఈసారి ఖ‌చ్చితంగా ఆ ప‌ని చేస్తాను – తెనాలి జ‌న‌సేన అభ్య‌ర్థి నాదెండ్ల మ‌నోహ‌ర్

113
0


రాజ‌కీయాల్లో విలువ‌ల కోసం ప‌ని చేసే వ్య‌క్తుల్లో నేను ఒక‌డిని. ప్ర‌భుత్వం ఎప్పుడూ… కొంత మందికి ప‌ని చేయ‌కూడ‌దు. అందరికి ప‌ని చేయాలి అని తెనాలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన త‌రుపున పోటీ చేస్తున్న నాదెండ్ల మ‌నోహ‌ర్ అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నాదెండ్ల మ‌నోహ‌ర్ ఓట‌ర్ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ…గ్రామాల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌ గురించి తెలుసుకుని ప్ర‌భుత్వ‌మే స్పందించాలి. ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు చేస్తాన‌ని మాట ఇచ్చిన హామీలు అన్నీ నెర‌వేర్చాను. చ‌క్రాయ‌పాలెంలో చేస్తాన‌న్న కార్య‌క్ర‌మం ఒక‌టే మిగిలిపోయింది.

నాకు తెలిసినంత వ‌ర‌కు నేను చేయాల్సింది. జంప‌నీకి పోయే డొంక రోడ్డు… చాలా సంద‌ర్భాల్లో రైతాంగం ఈ స‌మ‌స్య‌ను నా దృష్టికి తీసుకువ‌చ్చారు. నేను ఆ రోజుల్లో ముందు మిగ‌తా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసిన త‌ర్వాత ఆ కార్య‌క్ర‌మం చేస్తాన‌ని మాట ఇచ్చాను. ముందు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయాలి అనుకున్నాం. అలాగే చేసాం. అయితే…కొన్ని అనుకోని కార‌ణాల వ‌ల‌న జంప‌నీకి పోయే డొంక రోడ్డు నిర్మాణం జ‌ర‌గ‌లేదు.

ఈసారి ఖ‌చ్చితంగా ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాను. అంద‌రూ కూడా జ‌న‌సేన పార్టీ గుర్తైన గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి జ‌న‌సేన పార్టీని గెలిపించాలి. ఇక్క‌డ ఓ విష‌యం చెప్పాలి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ప్ర‌త్యేకంగా ఈ గుర్తు కోసం ఎందుకు కోరారంటే…ప్ర‌తి సామాన్యుడు ఇంట్లో గాజు గ్లాసు ఉంటుంది. ప్ర‌తి రోజు టీ కానీ, కాఫీ కానీ మంచి నీళ్లు కానీ గ్లాసుతోనే తాగుతాం. అందుకే అదే మా గుర్తు అనుకున్నాం. అదే గుర్తు రావ‌డంతో చాలా హ్యాపీగా ఫీల‌య్యాం. ఎంతో ఆత్మ‌విశ్వాసంతో జ‌న సైనికులు అంద‌రూ కూడా క‌ష్ట‌ప‌డుతున్నారు. మ‌రోసారి అవ‌కాశం ఇస్తే..త‌ప్ప‌కుండా తెనాలి నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌రింత‌గా అభివృద్ధి చేస్తాన‌ని మాట ఇస్తున్నాను అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here