Home Actor 106 సెంట‌ర్స్ లో అర్ధ శ‌త‌దినోత్స‌వం – ఎఫ్ 2 సంచ‌ల‌నం..!

106 సెంట‌ర్స్ లో అర్ధ శ‌త‌దినోత్స‌వం – ఎఫ్ 2 సంచ‌ల‌నం..!

70
0

విక్ట‌రీ వెంక‌టేష్ – మెగా హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ లో స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన చిత్రం ఎఫ్ 2. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. సినీ పండితులు సైతం ఆశ్చ‌ర్య‌పోయేలా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. అమెజాన్ ప్రైమ్ లో వ‌చ్చినా ఇంకా థియేట‌ర్స్ లో శ‌ని, ఆదివారాల్లో క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం.

ఈ సినిమా 106 సెంట‌ర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంద‌ని చిత్ర యూనిట్ అఫిషియ‌ల్ గా తెలియ‌చేసారు. దాదాపు 140 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఎంత పెద్ద హిట్ సినిమా అయినా స‌రే..రెండు, మూడు వారాలు ఆడుతుంది. అలాంటిది 106 సెంట‌ర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇదో స‌రికొత్త రికార్డ్. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని నిర్మాత దిల్ రాజు ఈరోజు ఎఫ్ 2 50 డేస్ ఫంక్ష‌న్ తో ఏర్పాటు చేసారు.

ఇంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించడంతో ఎఫ్ 3 కూడా ప్లాన్ చేస్తున్న‌ట్టు నిర్మాత దిల్ రాజు, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఇప్ప‌టికే ఎనౌన్స్ చేయ‌డం జ‌రిగింది. ఇందులో వెంకీ, వ‌రుణ్ ల‌తో పాటు మ‌రో హీరో కూడా ఉంటార‌ని చెప్పారు. ఆ మూడో హీరో మాస్ మ‌హారాజా ర‌వితేజ అని వార్త‌లు వ‌చ్చాయి. అయితే…చిత్ర యూనిట్ మాత్రం ఎవ‌ర‌నేది ఎనౌన్స్ చేయ‌లేదు. ఇదే క‌నుక నిజ‌మై..వెంకీ, వ‌రుణ్ ల‌తో పాటు మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా క‌లిస్తే..ఎఫ్ 3 ఏరేంజ్ లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here