Home News 13 నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు.!

13 నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు.!

85
0


ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో పార్టీ ప్ర‌చారం కార్య‌క్రమాల్లో చంద్ర‌బాబు జోరు పెంచుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ నెల‌17న విశాఖ జిల్లాలో పర్యటన చేయ‌నున్నారు. లోక్‌సభ నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తెదేపా అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 13 నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. రోజుకో జిల్లాలో ఆయన పర్యటిస్తారు.

జిల్లా పర్యటనల్లో భాగంగా ఆయన క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. జిల్లా స్థాయి నాయకుల నుంచి బూత్‌ కమిటీల సభ్యుల స్థాయి వరకు ఉన్న పార్టీ కేడర్‌తో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి తెదేపాలోకి రావాలనుకుంటున్నవారిని ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పార్టీలో చేర్చుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here