Home Actor 14 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ – అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన అనుష్క‌..!

14 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ – అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన అనుష్క‌..!

74
0


సూప‌ర్ సినిమాతో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించి..అన‌తి కాలంలోనే త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న అందాల తార అనుష్క‌. అందం, అభిన‌యం.. ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది తార‌ల్లో ఒక‌రుగా నిలిచారు. అరుంథ‌తి, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి..ఇలా వైవిధ్య‌మైన క‌థా చిత్రాల్లో న‌టిస్తూ…ఇలాంటి పాత్ర‌లు చేయాలంటే అనుష్క మాత్ర‌మే చేయాలి అనేంత‌గా ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు.

ప్ర‌స్తుతం అనుష్క‌ హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ నిర్మిస్తోంది. అయితే…ఆమె ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 14 సంవ‌త్స‌రాలు అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో స్పందిస్తూ…సినిమాల్లో త‌న‌కు ఎలా అవ‌కాశం వ‌చ్చిందో వీడియో ద్వారా తెలియ‌చేసారు. సినిమాల్లోకి నాకు నేనుగా రాలేదు. అస‌లు అవ‌కాశం వ‌చ్చినా చేస్తాన‌ని అనుకోలేదు.  సూప‌ర్ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసమ‌ని.. నాకు తెలిసిన ఆయ‌న పూరి స‌ర్ కి చెప్పారు.

ఆత‌ర్వాత పూరి స‌ర్ హైద‌రాబాద్ ర‌మ్మంటే వ‌చ్చాను. అలా..సూప‌ర్ సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది. నేను కెమెరా ముందుకు వ‌చ్చి 14 ఏళ్లు అవుతుంది. నా కోసం సమయం కేటాయించుకున్న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు నా జీవితాన్నే మార్చేసినవారందరికీ, నాగార్జున గారు, పూరి జగన్నాథ్ స‌ర్ కి, నా కుటుంబం, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు అని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here