Home Movie News 16వ `సంతోషం` సౌత్ ఇడింయన్ ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం

16వ `సంతోషం` సౌత్ ఇడింయన్ ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం

109
0
Santhosam awards

16వ సంతోషం సౌత్ ఇండియా సంతోషం ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం హైద‌రాబాద్ జెఆర్.సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో ఆట పాట‌ల‌తో..తార‌ల త‌ళుకుబెళుకుల నడుమ అంగ‌రంగ వైభవంగా ఎంతో  ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి, గాన కోకిల ఎస్. జాన‌కి ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఇంకా ప‌లువురు టాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు…రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల న‌టీన‌టుల‌కు అవార్డులు అందించ‌డం జ‌రిగింది.

ఈ వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ…నాకు అవార్డు ఇస్తానంటే వేడుక‌కు రాను. ఇవ్వ‌నంటేనే వ‌స్తాన‌ని సురేష్ కి ముందే చెప్పాను. కానీ న‌న్ను మోసం చేసి గాన కోకిల ఎస్. జాన‌కి గారు చేతుల మీదుగా అవార్డు బ‌హుక‌రించి న‌న్ను లాక్ చేసేసాడు. కాద‌న‌లేక ఈ అవార్డు తీసుకుంటున్నాను. చాలా సంతోషంగాను ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆమె చేతుల మీదుగా ఎప్పుడూ అవార్డు తీసుకోలేదు. సింగ‌పూర్ లో ఏదో అవార్డుల కార్య‌క్ర‌మంలోనే ఇద్ద‌రం క‌లిసాం. మ‌ళ్లీ సంతోషం వేడుక‌ల్లోనే క‌లిసాం. తొలిసారి ఆమె చేతుల మీద‌గా  సంతోషం అవార్డు తీసుకుంటున్నందుకు చాలా గ‌ర్వంగా ఉంది. ఈ సంద‌ర్భంగా సురేష కు ధ‌న్య‌వాధాలు తెలుపుతున్నా. మ‌రొక‌రు చేతులు మీదుగా ఇచ్చుంటే తిర‌స్క‌రించేవాడిని. ఎందుకంటే ఇలాంటి అవార్డులు కొత్త వారికి ఇచ్చి ప్రోత్స‌హిస్తే బాగుంటుంది. వాళ్ల‌లో ఉత్సాహం నింపిన‌ట్లు ఉంటుంది. వాళ్ల‌ను చూసి మ‌రెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. కొత్త త‌రం న‌టీన‌టులు, సాంకేతికి నిపుణులు ప‌రిశ్ర‌మ‌కు ఎంతైనా అవ‌స‌రం.

`సంతోషం` వేడుక‌ల్లో తొలిసారి అందాల తార శ్రీదేవి పేరు మీద స్మార‌క అవార్డును నెల‌కోల్ప‌డం చాలా సంతోషంగా ఉంది.  చాలా మంది హీరోయిన్ల‌తో క‌లిసి న‌టించాను..గాని ఆమెతో న‌టించిన ఆ నాలుగు సినిమాల అనుభ‌వాన్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. అందులోనూ ` జ‌గ‌దీక వీరుడు..అతిలోక సుంద‌రి` సినిమా ఓ మ‌ధుర జ్ఞాప‌కం.  శ్రీదేవి కెరీర్ ఆరంభంలో ఎలా ఉన్నారో?  చివ‌రికి వ‌ర‌కూ అలాగే ఉన్నారు. స్టార్ స్టేట‌స్ వ‌చ్చిన త‌ర్వాత కొంద‌రి హీరోయిన్ల‌ల‌లో మార్పులొస్తాయి. కానీ శ్రీదేవి లో ఎలాంటి మార్పులు రాలేదు.  డౌన్ టు ఎర్త్ గానే న‌డుచుకున్నారు. ఆమెను చూసి నేను కొన్ని కొన్ని విష‌యాలు తెలుసుకున్నాను. ఆమెకు ఓపిక‌..స‌హ‌నం ఎక్కువ‌. అందుకే అంత పెద్ద స్టార్ అయ్యారు. సౌత్ ఇండియాలో నెంబ‌ర్ స్టార్ హీరోయిన్లు ఉన్నారు.  నార్త్ ఇండియాలోనూ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్లు ఉన్నారు. ఇలా నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్లు ఎంత మంది ఉన్నా శ్రీదేవి ఒక్క‌రే  ఆల్ ఇండియా లేడీ సూప‌ర్ స్టార్ గా కీర్తింప‌బ‌డడ్డారు. ఆమె అవార్డును త‌మ‌న్నా అందుకోవ‌డం సంతోషంగా ఉంది.

సంక‌ల్ప్ ను ఓసారి మీలో రానా ప‌రిచం చేసాడు. త‌ర్వాత మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు స‌మ‌యంలో చూసాను. అత‌ను  మాట‌ల మ‌నిషికాదు..చేత‌ల మ‌నిషి. త‌న ప‌నిత‌నాన్ని `ఘాజీ` సినిమాతో చాటి చెప్పాడు. ఆ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌డు మా వ‌రుణ్ తేజ్ తో స్పేస్ బ్యాక్ డ్రాప్ లో `అంత‌రిక్షం` సినిమా చేస్తున్నాడు. కొన్ని విజువ‌ల్స్ చూసాను. చాలా బాగున్నాయి. ఘాజీ క‌న్నా ఆ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా.

రామ్ -ల‌క్ష్మ‌ణ్ ఎక్క‌డో వేట‌పాలెం నుంచి మ‌ద్రాస్ వ‌చ్చి ఫైట్ మాస్ట‌ర్లు అయ్యారు. అప్ప‌ట్లో నాకు రాజు అనే స్టంట్ మాస్ట‌ర్ ఎక్కువ‌గా ఫైట్లు కంపోజ్ చేసేవారు. ఆయన వ‌ద్ద స‌హాయ‌కులుగా చేరి..గొడుగు ప‌ట్టిన వాళ్లు ఈరోజు ఇంత మంచి స్థానానికి రావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు హీరోలంతా రామ్ ల‌క్ష్మ‌ణ్ డేట్లు అడుగుతున్నారు. లేదంటే వాయిదా వేసుకుంటున్నారంటే వాళ్లు ఎంత గొప్ప వాళ్లు అయ్యారో అర్ధం చేసుకోవ‌చ్చు. వీళ్లు ఇప్పుడు చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నార‌ని చిరంజీవి ముగించారు.

గాన‌కోకిల ఎస్.జాన‌కి మాట్లాడుతూ.. సురేష్ 5 ఏళ్ల నుంచి ఫంక్ష‌న్ కు రావాల‌ని అడుగుతున్నాడు. కానీ నాకు కుద‌ర‌క రాలేక‌పోతున్నాను. కానీ ఈసారి క‌చ్చితంగా వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుని వ‌చ్చా. ఇక్క‌డ చిరంజీవిగార్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మెగాస్టార్ కు చాలా సినిమాల్లో పాట‌లు పాడాను. అప్ప‌టి హిట్ సాంగ్స్ అన్నీ దాదాపు నావే. చిరు క‌ళ్ల‌లో ఏదో మాయ ఉంది. ఒంట్లో ఎన‌ర్జీ ఉంది. న‌ట‌న‌, డాన్సు, ఫైట్లు ఇలా ప‌త్రీ విష‌యంలో ఆయ‌న ప్ర‌త్యేక‌మే. ఆయన్ని చూస్తే..ఆయ‌న వెంట ఎవ‌రైనా ప‌డాల్సిందే ( సినిమాల్లో న‌వ్వుతూ). 125 ఏళ్లు సంతోషంగా జీవించాలి.  ఖైదీ నంబ‌ర్ 150వ సినిమా చూసాను. పాత చిరంజీవిని చూసిన‌ట్లే ఉంది. ఇక ఇప్పుడు న‌టిస్తోన్న సైరా న‌ర‌సింహారెడ్డి కూడా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా అని అన్నారు.

ఇంకా ఈ వేడుక‌ల్లో మంత్రి త‌ల‌సాని  శ్రీనివాస యాదవ్, అల్లు అర‌వింద్, ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు, నిర్మాత సురేష్ బాబు, కె.ఎల్ నారాయ‌ణ, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, రాజేంద్ర ప‌సాద్, త‌మ‌న్నా, త‌మ‌న్నా,  ఏపీ ఎఫ్ డీసీ చైర్మెన్ అంబికా రాధాకృష్ణ‌,  `మా` జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నరేష్, బ్ర‌హ్మాజీ, ర‌చ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా, శేఖ‌ర్ మాస్ట‌ర్ ఇంకా ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. అవార్డు గ్ర‌హీత‌లు  మెహ‌రీన్, ఈషా, ప్ర‌సన్న‌, స్నేహ తో పాటు, మ‌ల‌యాళ,  క‌న్న‌డ న‌టీన‌టులు, సాంకేతిక  హాజ‌ర‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here