Home Movie News 2 మిలియ‌న్ వ్యూస్ తో దూసుకెళుతోన్న సిల్లీ ఫెలోస్..!

2 మిలియ‌న్ వ్యూస్ తో దూసుకెళుతోన్న సిల్లీ ఫెలోస్..!

95
0
Silly fellows 2 million views

అల్ల‌రి న‌రేష్ – సునీల్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైన‌ర్ సిల్లీ ఫెలోస్. ఈ చిత్రానికి భీమ‌నేని శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్ ను ఇటీవ‌ల సూపర్ స్టార్ మ‌హేష్ బాబు రిలీజ్ చేసారు. అల్ల‌రి న‌రేష్, సునీల్, బ్ర‌హ్మానందం, పోసాని త‌దిత‌ర న‌టీన‌టుల ఉన్న ఈ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తోంది. ఈ ట్రైల‌ర్ చూసిన కొద్ది.. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపిస్తుంది. మ‌హేష్ బాబు ఈ ట్రైల‌ర్ ను ఇలా రిలీజ్ చేసారో లేదో…అలా…యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం స్టార్ట్ చేసారు సిల్లీ ఫెలోస్.

ఈ ట్రైల‌ర్ 1 మిలియ‌న్ వ్యూస్ కాదు..2 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి 3 మిలియ‌న్ దిశ‌గా దూసుకెళుతోంది. ట్రైల‌రే ఇలా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంటే..ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనే టాక్ వినిపిస్తోంది. బ్లూ ప్లానెట్ ఎంట‌ర్ టైన్మెంట్ ఎల్ఎల్ పి.. మ‌రియు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్స్ పై కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మించారు. టి.జి విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రాన్ని భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

అల్ల‌రి న‌రేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ‌, నందినిరాయ్, బ్ర‌హ్మానందం, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, పోసాని కృష్ణ‌ముర‌ళి, రాజార‌వీంద్ర‌, చ‌ల‌ప‌తిరావు, అదుర్స్ ర‌ఘు, ఝాన్సీ, హేమ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: అనీష్ త‌రుణ్ కుమార్, ఆర్ట్ డైరెక్ట‌ర్: ఎం కిర‌ణ్ కుమార్, సంగీత ద‌ర్శ‌కుడు: శ్రీ‌వ‌సంత్, ఎడిట‌ర్: గౌతంరాజు, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్, సంస్థ‌లు: బ్లూ ప్లానెట్ ఎంట‌ర్ టైన్మెంట్ మ‌రియు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ,నిర్మాత‌లు: కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి, ద‌ర్శ‌కుడు: భీమినేని శ్రీ‌నివాస్,

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here