Home Political News 2 వ తేదీ నుంచి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభం

2 వ తేదీ నుంచి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభం

92
0

కాటన్ బ్యారేజి మీదుగా కవాతు చేస్తూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్  తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టారు. నవంబర్ 2 వ తేదీ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్  చేపట్టే యాత్ర మొదలవుతుంది. తుని పట్టణం నుంచి ఇందుకు శ్రీకారం చుడుతున్నారు. ఆ రోజు సాయంత్రం తుని రైల్వేస్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం స్థానిక నాయకులతో సమావేశం అవుతారు. తదుపరి ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి అడుగుపెడతారు. కత్తిపూడి జంక్షన్ లో బహిరంగ సభ ఉంటుంది.  4 వ తేదీ ఉదయం వంతాడలో లేటరైట్ కార్మికులతో సమావేశం, రచ్చబండ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం జగ్గంపేట బహిరంగ సభలో పాల్గొంటారు.

5 వ తేదీన కాకినాడలో పారిశుధ్య కార్మికులతో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు పెద్దాపురంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పెద్దాపురం ప్రజలతో సమావేశమవుతారు. 6 వ తేదీన కాకినాడ ఎస్.ఈ.జడ్. నిర్వాసితులు, రైతులు శ్రీ పవన్ కళ్యాణ్ ని కలిసి తమ సమస్యలు వివరిస్తారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు పిఠాపురంలో బహిరంగ సభ ఉంటుంది. 7 వ తేదీన షెడ్యూల్ కులాల ప్రజలతో సమావేశం ఉంటుంది. 9 వ తేదీ సాయంత్రం 4 గంటలకు కాకినాడ నగరంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here