Home Telugu
102
0

ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ ను తేజ తెర‌కెక్కించ‌నున్నార‌ని…ఇందులో చిరంజీవి పాత్ర కూడా ఉంటుంద‌ని…చిరు పాత్ర‌ను రాజ‌శేఖర్ పోషించ‌నున్నాడ‌ని…వార్త‌లు రావ‌డంతో అటు అభిమానుల్లో ఇటు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. దీనికి తేజ కాబోయే అల్లుడు అనే టైటిల్ ఫిక్స్ చేసారంటూ టైటిల్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. దీంతో ఈ ప్రాజెక్ట్ లో ఎవ‌రెవ‌రు న‌టించ‌నున్నారు అనే ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే…డైరెక్ట‌ర్ తేజ‌ను సంప్ర‌దిస్తే… ఈ వార్త ఎలా వ‌చ్చిందో..? ఎవ‌రు సృష్టించారో తెలియ‌దు. ఇందులో ఏమాత్రం నిజం లేద‌ని తేల్చేసారు.

ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత తేజ రానాతో సినిమా చేసేందుకు క‌థ రెడీ చేసార‌ట‌. రానా క‌థ విని గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో త్వ‌ర‌లోనే సినిమా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఇదిలా ఉంటే… రాజ‌శేఖ‌ర్ తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని వ‌చ్చిన వార్త‌ల్లో వాస్త‌వం ఉంది కానీ..ఉద‌య్ కిర‌ణ్ బయోపిక్ కోసం కాద‌ని చెప్పారు. మ‌రి ఏ సినిమా కోసం అంటారా..?  రానా హీరోగా రూపొందించే సినిమాలో విల‌న్ పాత్ర‌కు రాజ‌శేఖ‌ర్ అయితే క‌రెక్ట్ గా సూట్ అవుతార‌ని అనుకుంటున్నాడ‌ట‌.

ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ తీసే ఆలోచ‌న లేద‌ని తేజ చెప్పిన‌ప్ప‌టికీ…మీడియాకి ఆయ‌నే లీకు లిచ్చి..ఇప్పుడు మాట మార్చార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి..నిజంగానే తేజ ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ తెర‌కెక్కించాల‌నుకున్నాడా..? ఎవ‌రైనా ఒత్తిడి చేయ‌డం వ‌ల‌న త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నాడా..? లేక ఇదంతా పుకారేనా..?  అనేది తేజ‌కే తెలియాలి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here