Home Telugu
108
0

రైట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ రాజ‌సింహ ముంబైలో ఆత్మ‌హ‌త్మాయ‌త్నం చేయ‌డం..వెంట‌నే ఫ్యామిలీ మెంబ‌ర్స్ హాస్ప‌ట‌ల్ కి తీసుకెళ్ల‌డం తెలిసిందే. ఈ  వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ఫ్రెండ్స్, స‌న్నిహితులు చాలా కంగారు ప‌డ్డారు. ఆత‌ర్వాత రాజ‌సింహకి హాస్ప‌ట‌ల్ లో చికిత్స అందిస్తున్నారు. డాక్ట‌ర్స్ ఏం కంగారు ప‌డాల్సిన అవ‌స‌రంలేద‌ని చెప్పార‌నే విష‌యాన్నిమీడియాకి తెలియ‌చేసారు. అయితే..స్వ‌యంగా రాజ‌సింహ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసాడు.

ఆ వీడియోలో… నేను రాజసింహా. నేను క్షేమంగా ఉన్నాను. నాకు డయాబెటిక్‌ ఉంది. షుగర్‌ లెవల్‌ డౌన్‌ అవ్వడం, రాత్రి పక్కన ఎవరూ లేకపోవడంతో కాస్త సీరియస్‌ అయింది. నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను. నా గురించి కంగారు పడ్డ వాళ్లందరికి ధన్యవాదాలు. ఇంకో 2, 3 రోజుల్లో హైదరాబాద్‌ వస్తాను అని తెలియ‌చేసారు.

రుద్ర‌మ‌దేవి సినిమాలో అల్లు అర్జున్ పాత్ర‌కు సంభాష‌ణ‌లు రాసిన రాజ‌సింహ‌… శంక‌ర్ దాదా ఎంబీబీయ‌స్, బొమ్మ‌రిల్లు, ఝుమ్మందినాధం, అన‌గ‌న‌గా ఓ ధీరుడు త‌దిత‌ర చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా వ‌ర్క్ చేసాడు.  సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన‌ ఒక్క అమ్మాయి త‌ప్ప సినిమా ద్వారా ద‌ర్శ‌కుడుగా ప‌రిచయం అయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here