Home Telugu
124
0

హీరోగా కెరీర్ ప్రారంభించి..తొలి ప్ర‌య‌త్నంలోనే ద్విపాత్రాభిన‌యంతో ఆక‌ట్టుకున్న జ‌గ‌ప‌తిబాబు…ఆత‌ర్వాత కుటుంబ క‌థా చిత్రాల క‌థానాయ‌కుడుగా మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు. ఇంకా చెప్పాలంటే…నేటిత‌రం శోభ‌న్ బాబు అనేంత పేరు తెచ్చుకున్నారు జ‌గ్గుభాయ్. ఆత‌ర్వాత యువ హీరోలు చాలా మంది రావ‌డం…అత‌ని సినిమాలు ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో రూటు మార్చి క‌థానాయ‌కుడు కాస్త ప్ర‌తి నాయ‌కుడు అయ్యాడు.

లెజెండ్ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా న‌టించి మెప్పించ‌డంతో జ‌గ్గుభాయ్ కి డిమాండ్ బాగా పెరిగింది. తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ సినిమాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీ అయ్యారు. ఇప్పుడు ఈ విల‌న్ వెబ్ సిరీస్ లో ఎంట్రీ ఇవ్వ‌డం విశేషం. కాలంతో పాటు త‌న‌ని తాను మార్చుకుంటూ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర అవుతోన్న జ‌గప‌తిబాబు గ్యాంగ్ స్టార్ అనే వెబ్ సిరీస్ లో న‌టించారు. డార్క్‌ కామెడీగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టార్స్‌ వెబ్‌ సిరీస్‌లో జగపతిబాబు గూండా కృష్ణదాస్‌ పాత్రలో కనిపించనున్నారు.

ల‌క్ష్మీ భూపాల్ రాసిన ఈ క‌థ‌ను నందిని రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో ‘దడ’ ఫేం అజయ్ భుయాన్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేస్తున్నారు.శ్వేత బసు ప్రసాద్‌, నవదీప్‌, పోసాని కృష్ణ మురళి, శివాజీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌ను 12 ఎపిసోడ్లుగా రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయనున్నారు. జూన్‌ 1న తొలి ఎపిసోడ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజ్ చేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here