Home Telugu
107
0

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న సినిమాకి అర‌వింద స‌మేత అనే టైటిల్ ఫిక్స్ చేసారు. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మూవీ టైటిల్ & ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు. హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అసామాన్యుడు, రా రా కుమరా…ఇలా ర‌క‌ర‌కాల టైటిల్స్ అనుకున్న‌ప్ప‌టికీ ఫైన‌ల్ గా అర‌వింద స‌మేత టైటిల్ నే ఖ‌రారు చేసారు.

ఇక ఫ‌స్ట్ లుక్ విష‌యానికి వ‌స్తే…సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ఎన్టీఆర్ ఇందులో అదరగొట్టేశాడు. ఈ లుక్ లో ఎన్టీఆర్‌ చాలా స్టైలిష్‌గా కండలవీరుడిగా కనపడుతున్నాడు. టైటిల్ చూస్తే..క్లాస్ గా ఉండ‌డం… ఎన్టీఆర్ లుక్ చూస్తే..మాస్ గా ఉండ‌డం ఆస‌క్తి క‌లిగిస్తోంది. అటు అభిమానుల నుంచి ఇటు ఇండ‌స్ట్రీ నుంచి చాలా ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. సీనియ‌ర్ రైట‌ర్ ప‌రుచూరి గోపాల‌కృష్ణ ఫ‌స్ట్ లుక్ గురించి ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ…ఎన్టీఆర్ లుక్కు చూస్తే బిగోపాల్, వినాయక్, బోయపాటి స్టైల్… టైటిల్ చూస్తే త్రివిక్రమ్ స్టైల్… తప్పకుండా సంచలనం సృష్టిస్తుంది అనిపిస్తోంది అని తెలియ‌చేసారు.

ఇదిలా ఉంటే…యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు తార‌క్ కి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌చేసారు. తనకు బర్త్ డే విషెస్ తెలిపిన‌ అభిమానులకు రిప్లై ఇచ్చారు తారక్ . ట్విట్ట‌ర్ లో తార‌క్ స్పందిస్తూ.. మీరు (అభిమానులు) చూపిస్తున్న ఈ ప్రేమకు వెలకట్టలేను. అభిమానులందరికి నా ధన్యవాదాలు తెలియ‌చేసారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా  ప్రాంతాలలో అభిమానులు ఎన్టీఆర్ బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకున్నారు  ఎన్టీఆర్ ఇంటికి కూడా భారీగా అభిమానులు చేరుకొని పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here