Home Telugu
132
0

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రారంభించ‌డం…ఆత‌ర్వాత ఈ మూవీ నుంచి తేజ త‌ప్పుకోవ‌డం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌రు అనేది ఆస‌క్తిగా మారింది. రాఘవేంద్ర‌రావు, పి.వాసు, కృష్ణ‌వంశీ, పూరి జ‌గ‌న్నాథ్, చంద్ర‌సిద్ధార్ధ‌..ఇలా చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. అయితే…ఎవ‌రు ఇంట్ర‌స్ట్ చూపించ‌క‌పోవ‌డంతో బాల‌య్యే ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు అనే టాక్ కూడా వ‌చ్చింది.

తాజాగా డైరెక్ట‌ర్ క్రిష్ పేరు తెర పైకి వ‌చ్చింది. దాదాపు క్రిష్ ఖ‌రారు అయిన‌ట్టు స‌మాచారం. ఈనెల 28న ఎన్టీఆర్ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ పూర్తి వివ‌రాలును అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తార‌ని తెలిసింది. ఇదిలా ఉంటే…ఎన్టీఆర్ బ‌యోపిక్ కంటే ముందుగా బాల‌య్య‌ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ మూవీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అది ఏంటంటే…ఈ మూవీకి పరుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ అందిస్తున్నార‌ట‌. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత బాల‌య్య సినిమాకి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ అందిస్తుండ‌డం విశేషం. బాల‌య్య‌కు మాస్ లో క్రేజ్ ఏరేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఇక డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ కూడా మాసే. వీరిద్ద‌రికి ప‌వ‌ర్ ఫుల్ స్టోరీతో… మాస్ తో క్లాప్స్ కొట్టించే… పరుచూరి బ్ర‌ద‌ర్స్ తోడైతే… ఇక ఈ ఊర మాస్ మూవీ ఏరేంజ్ లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఈనెల 27న ఈ సినిమాని ప్రారంభించ‌నున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి కానీ..బాల‌య్య స‌న్నిహితులు మాత్రం ఈ మూవీ గురించి బాల‌య్య ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు అంటున్నారు. మ‌రి..వినాయ‌క్ తో మూవీకి బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారో..లేదో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here