Home Telugu
107
0

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ – హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం నేల టిక్కెట్టు. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించారు. క్లాసు – మాసు అనే తేడా లేకుండా అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా నేల టిక్కెట్టు సినిమా ఉంటుంది అంటున్నారు డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌. ఈనెల 25న నేల టిక్కెట్టు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ నేల టిక్కెట్టు చిత్ర విశేషాల‌ను మీడియాతో పంచుకున్నారు.

ర‌వితేజ ఇందులో ఆవారాగా తిరిగే కుర్రాడిగా క‌నిపిస్తాడు. అతని క్యారెక్టర్‌కు రెండు షేడ్స్‌ ఉంటాయి. కామెడీ యాంగిల్‌ ఒకటి. ఫైర్‌ యాంగిల్‌ మరోటి. చుట్టూ జనం, మధ్యలో మనం ఉండాలి అనే మనస్తత్వం ఉన్న క్యారెక్టర్‌ అతనిది. 70 శాతం కామెడీ ఉంటుంది. ర‌వితేజ సినిమా అంటే ఆడియ‌న్స్ ఎలా ఉంటుంది అనుకుంటారో..అలాగే ఈ సినిమా ఉంటుందన్నారు క‌ళ్యాణ్ కృష్ణ‌. ర‌వితేజ గారి గురించి చెప్పాలంటే… రవితేజ గారితో వ‌ర్క్ చేస్తూ..ఆయ‌న‌ దగ్గర సిన్సియారిటీ నేర్చుకున్నాను. పని పట్ల ఆయనకు ఉన్న రెస్పెక్ట్‌ చాలా గ్రేట్‌. ఇవాళ ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పనిని కచ్చితంగా ఆ రోజే కంప్లీట్‌ చేస్తారు. స్క్రీన్‌ మీద ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారో బయట కూడా అలానే ఉంటారన్నారు.

టైటిల్ గురించి చెబుతూ…ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో ఏ సినిమానైనా…ఫ‌స్ట్ బాల్క‌నీ టిక్కెట్టుతో చూసి..ఆత‌ర్వాత నేల టిక్కెట్టు కొనుక్కుని మ‌రీ చూసేవాడిని. ఇలా ఒక్కో సినిమాని రెండు సార్లు చూసేవాడిని. బాల్క‌నీ టిక్కెట్టు కొనుక్కుని చూసే వాళ్లు లాజిక్ లు చూస్తారు అదే నేల టిక్కెట్టుతో సినిమా చూసే వారు లాజిక్ లు చూడ‌రు. ఈ సినిమా విష‌యానికి వస్తే…బాల్క‌నీ, నేల టిక్కెట్టు ఏ టిక్కెట్టు కొనుక్కుని చూసిన వారికైనా స‌రే..ఖ‌చ్చితంగా న‌చ్చుతుంది. అందుకే…ఈ మూవీకి నేల టిక్కెట్టు అనే టైటిల్ పెట్టానన్నారు.

 

 

ఈ సినిమా త‌ర్వాత సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి ప్రీక్వెల్ తీయాల‌నుకుంటున్నాను. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. నేల టిక్కెట్టు రిలీజ్ త‌ర్వాత బంగార్రాజు క‌థ‌ను నాగార్జున గార్కి చెబుతాను. జూన్ లేదా జులైలో బంగార్రాజు చిత్రాన్ని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నామ‌ని క‌ళ్యాణ్ కృష్ణ‌. మ‌రి…సోగ్గాడే చిన్ని నాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం..చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన క‌ళ్యాణ్ కృష్ణ నేల టిక్కెట్టుతో హ్యాట్రిక్ సాధిస్తాడేమో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here