Home Telugu
117
0

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం నేల టిక్కెట్టు. హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. రామ్ తాళ్లూరి ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. ర‌వితేజ సినిమా అంటే..ఆడియ‌న్స్ ఎలా ఉండాల‌ని కోరుకుంటారో అలా నేల టిక్కెట్టు సినిమా ఉంటుంద‌ని అంటున్నారు. ఈనెల 25న నేల టిక్కెట్టు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది.

ఈ సంద‌ర్భంగా ర‌వితేజ నేల టిక్కెట్టు చిత్ర విశేషాల‌ను తెలియ‌చేస్తూ….నేను ఎప్పుడూ  హ్యాపీగా..స‌ర‌దాగా ఉండాల‌నుకుంటాను. క‌ళ్యాణ్ కృష్ణ క‌థ చెప్పిన‌ప్పుడు చుట్టూ జ‌నం మ‌ధ్య‌లో మ‌నం అని చెప్పాడు. అలాగే..ముస‌లిత‌నం అంటే చేత‌కానిత‌నం కాదు…నిలువెత్తు అనుభ‌వం అని చెప్పాడు. ఈ రెండు పాయింట్స్ నాకు బాగా న‌చ్చాయి. వెంట‌నే ఈ స్టోరీకి ఓకే చెప్పాను. క‌ళ్యాణ్ కృష్ణ‌తో ఎప్పుడో సినిమా చేయాలి కానీ..అప్పుడు కుద‌ర‌లేదు. ఇప్పుడు కుదిరింది అన్నారు.

క‌థ‌లో కొత్త‌ద‌నం అంటే…ఏ క‌థ తీసుకున్నా..ఎక్క‌డో ఏదో పోలిక ఉండ‌చ్చు. కొత్త క‌ధ‌లు రావ‌డం క‌ష్టం. కాక‌పోతే ఇందులో క‌థ‌నం మాత్రం చాలా కొత్త‌గా ఉంటుంది. అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది. ఎంట‌ర్ టైన్మెంట్, ఫైట్స్, ఎమోష‌న్…ఇలా  అన్ని అంశాలు ఉంటాయి. నేల టిక్కెట్టు అని టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం ఏమిటి అని చాలా మంది అడుగుతున్నారు. సినిమా చూసిన త‌ర్వాత ఈ మూవీకి ఈ టైటిల్ క‌రెక్ట్ అని అంద‌రూ చెబుతారు. అంద‌రూ నేల టిక్కెట్టు కొని సినిమా చూసుంటారు. అయితే…ఈ జ‌న‌రేష‌న్ వారికి నేల టిక్కెట్టు అంటే తెలియ‌క‌పోవ‌చ్చు. ఈ సినిమాతో అంద‌రూ నేల టిక్కెట్టు గురించి తెలుసుకుంటున్నారు. నేను తొంభై పైస‌లతో నేల టిక్కెట్టు కొని సినిమాలు చూసాను. ఆ రోజుల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. మా నేల టిక్కెట్టు…కేవ‌లం నేల టిక్కెట్టు వాళ్ల‌కే కాదు..బాల్క‌నీ వాళ్ల‌కి కూడా న‌చ్చుతుంది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here