Home Telugu
125
0

కోన ఫిల్మ్ కార్పోరేష‌న్…డి.వి.వి ఎంట‌ర్ టైన్మెంట్స్ తో క‌లిసి నిన్ను కోరి అనే సినిమాని నిర్మించింది. ఈ సినిమా ఎంత‌టి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అలాగే కోన కార్పోరేష‌న్, ఎమ్ వీవీ సినిమాస్ సంస్థతో క‌లిసి అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో గీతాంజ‌లి అనే సినిమాని నిర్మించింది. ఈ సినిమా కూడా ఘన విజ‌యం సాధించింది. తాజాగా మ‌రో స‌క్స‌స్ సాధించేందుకు… కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ ఎమ్ వీవీ సినిమాతో క‌లిసి ఓ సినిమాని నిర్మిస్తోంది. ఈ మూవీలో ఆది పినిశెట్టి, తాప్సి , రితికా సింగ్ హీరో, హీరోయిన్లుగా కనిపించనున్నారు.

ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు.  ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ ను హీరో నాని ఎనౌన్స్ చేయ‌నున్నాడు. హ‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా పూర్తి వివ‌రాల‌ను త్వరలోనే తెలియ‌చేయ‌నున్నారు. కొంతకాలంగా తెలుగులో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ వస్తోన్న ఆది పినిశెట్టి, ఈ సినిమాతో మళ్లీ హీరోగా ఆడియన్స్ ముందుకు వ‌స్తుండ‌డం విశేషం. మ‌రి…ఆది పినిశెట్టికి ఈ సినిమా హీరోగా మంచి విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here