Home Telugu
107
0

తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం…ఇలా భాష ఏదైనా స‌రే… ఆర్టిస్టులు ఎవ‌రైనా స‌రే…హ‌ర్ర‌ర్ మూవీ అయితే చాలు…ప్రేక్ష‌కులు సినిమా చూసుందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో హీరో సిద్ధార్థ్ మూడు భాషల్లో విడుదల చేసిన గృహం అనే హార్ర‌ర్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మూడు భాషల్లోను మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి స‌క్స‌స్ సాధించింది. అందుక‌నే హ‌ర్ర‌ర్ మూవీస్ చేయ‌డానికి ఇటు ఆర్టిస్ట్ లు అటు నిర్మాత‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు.

మంత్ర‌, అరుంధ‌తి, గీతాంజ‌లి, భాగ‌మ‌తి, ఆనందో బ్ర‌హ్మ‌…ఇలా హ‌ర్ర‌ర్ నేప‌ధ్యంతో వ‌చ్చిన సినిమాలకు ఆడియ‌న్స్ బాగా క‌నెక్ట్ అవుతున్నారు. అందుక‌నే అనుకుంట తాజాగా అంజలి కథానాయికగా ఓ హార్ర‌ర్ మూవీ రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తోన్న ఈ సినిమాకి ‘లిసా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగు, తమిళ భాషల పై అంజలికి మంచి పట్టు వుంది. ఈ రెండు భాషల్లోను ఆమెకి మంచి క్రేజ్ వుంది. అంతే కాకుండా గతంలో ఆమె న‌టించిన‌ గీతాంజలి అనే హారర్ మూవీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

దీంతో అంజ‌లి లిసా అనే హ‌ర్ర‌ర్  మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం కానున్న‌ రాజు విశ్వనాథ్ త్రీడీ హార్ర‌ర్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. డిఫ‌రెంట్ గా ఉన్న లిసా మూవీ పోస్ట‌ర్ ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. త్వరలోనే పూర్తి  వివరాలు తెలియ‌చేయ‌నున్నారు. మ‌రి…గీతాంజ‌లి వ‌లే లిసా కూడా అంజ‌లికి విజయాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here