Home Telugu
119
0

న‌టిగా, నిర్మాత‌గా, వ్యాఖ్యాత‌గా…ఇలా త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో రాణిస్తూ…త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి మంచు ల‌క్ష్మీ.  అన‌గ‌న‌గా ఓ ధీరుడు, దొంగ‌ల ముఠా, గుండెల్లో గోదారి, దొంగాట‌…ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో విభిన్న పాత్ర‌లు పోషిస్తూ..మెప్పిస్తున్న మంచు ల‌క్ష్మీ తాజా చిత్రం w/o రామ్. రాజమౌళి ద‌గ్గ‌ర‌ ఈగ, బాహుబలి  చిత్రాలకు అసిస్టెంట్ గా వ‌ర్క్ చేసిన‌ విజయ్ యలకంటి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో అంద‌రికీ న‌చ్చేలా ఈ థ్రిల్ల‌ర్ మూవీ రూపొందుతోంది. ఇటీవ‌ల ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేసారు. ఇంట్ర‌స్టింగ్ గా ఉన్న ఈ టీజ‌ర్ సినిమా పై మ‌రిన్ని అంచ‌నాలు పెంచింది. ఊహించ‌ని ట్విస్టుల‌తో ప్ర‌తి క్ష‌ణం ఉత్కంఠ‌గా సాగే క‌థ‌నంతో రూపొందుతోన్న ఈ సినిమా ఆల్ ఆడియ‌న్స్ కి క‌నెక్ట్ అవుతుందంటున్నారు చిత్ర యూనిట్. ఈరోజు (మే 23) ఈ మూవీ పోస్ట‌ర్ ను మంచు ల‌క్ష్మి ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు.

ఇందులో మంచు ల‌క్ష్మి పోషిస్తోన్న దీక్ష క్యారెక్ట‌ర్ ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ అయిన‌ప్ప‌టికీ..ఇందులో బంధాలు – అనుబంధాల‌కు పెద్ద పీట వేసిన‌ట్టు టీజ‌ర్ & పోస్ట‌ర్ ను చూస్తే తెలుస్తుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. మంచు లక్ష్మి టైటిల్ రోల్ లొ నటిస్తోన్న ఈ చిత్రంలో సమ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న w/o రామ్  మంచు ల‌క్ష్మికి మంచి విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిస్తూ..ఆల్ ది బెస్ట్ టు w/o రామ్ టీమ్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here