Home Telugu
101
0

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ…ఓ సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో క‌ళ్యాణ్ స‌ర‌స‌న మాళ‌విక నాయ‌ర్ న‌టిస్తోంది. అయితే…ఈ మూవీ సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లో రిలీజ్ కి రెడీ అవుతోంది. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఏ టైటిల్ పెట్ట‌నున్నారు అనేది ఆస‌క్తిగా మారింది.

చిరంజీవి మూవీ టైటిల్ విజేత‌నే ఈ సినిమా టైటిల్ గా పెట్ట‌డం విశేషం. ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసి సోష‌ల్ మీడియాలో  పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. నిస్సహాయులకు అండగా నేనున్నానంటూ వాళ్లకి చేయూతనిస్తున్నట్టుగా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. ఇతరుల ముఖంలోని ఆనందానికి కారకుడివైతే నువ్వు సక్సెస్ అయినట్టే.. అనే అర్థం వచ్చేలా పెట్టిన క్యాప్షన్ బాగుంది. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లో విజేత అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న క‌ళ్యాణ్ దేవ్ విజేత‌గా నిలుస్తాడో లేదో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here