Home Telugu
110
0

టాలీవుడ్ కింగ్ నాగార్జున – సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం ఆఫీస‌ర్. ఇందులో నాగార్జున  సిన్సియ‌ర్ & ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీర్ గా న‌టించారు. ఈ స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఆఫీస‌ర్ జూన్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.  ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సాంగ్ గా  ‘నవ్వే నువ్వు’ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషన్ సీన్స్ తో ఈ సాంగ్ కొనసాగుతోంది. ఒక వైపున తండ్రీ కూతుళ్ల మధ్య గల అనుబంధానికి అద్దం పడుతూనే, మరో వైపున వృత్తి పరంగా నాగ్ కి సంబంధించిన యాక్షన్ సీన్స్  ఈ సాంగ్ లో చూపించారు.

సిరాశ్రీ రాసిన సాహిత్యానికి రవిశంకర్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా వుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. మే 25న రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ…కొన్ని కార‌ణాల వ‌ల‌న జూన్ 1న ఆఫీస‌ర్ ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈనెలాఖ‌రున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు. టీజ‌ర్ & ట్రైల‌ర్ రిలీజ్ చేసిన‌ప్ప‌టికీ ఆడియ‌న్స్ లో ఈ మూవీ పై ఆశించిన స్ధాయిలో ఇంట్ర‌స్ట్ క్రియేట్ కాలేదు. అయిన‌ప్ప‌టికీ..టీమ్ మాత్రం ఆఫీస‌ర్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మ‌రి..ఆఫీస‌ర్ ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో  జూన్ 1న తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here