Home Telugu
120
0

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం అర‌వింద స‌మేత‌. ఈ చిత్రానికి వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన అర‌వింద స‌మేత ఫ‌స్ట్ లుక్ కి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. టైటిల్ చూస్తే..క్లాస్ గా ఉంది. ఎన్టీఆర్ లుక్ చూస్తే..ఫుల్ మాస్ గా ఉంది. అటు క్లాసు, ఇటు మాసు…అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా ఈ సినిమా ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…ఈ సినిమా స్టోరీ రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి తోడు ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్ లో ప‌వర్ ఫుల్ గా క‌నిపించ‌డంతో రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ అనేది నిజ‌మే అనిపించింది. ఇదిలా ఉంటే…ఈ సినిమాలో డైలాగ్ అంటూ ఓ డైలాగ్ లీక్ అయ్యింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇంత‌కీ ఆ డైలాగ్ ఏంటంటే…అన్నా.. మాది రాయ‌ల‌సీమ. న‌మ్మితే ప్రాణం ఇస్తాం..న‌మ్మ‌క ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాం.

ఎన్టీఆర్ రాయ‌ల‌సీమ స్లాంగ్ లో  చెప్పే  ఈ ప‌వ‌ర్ ఫుల్  డైలాగ్ హైలైట్ గా నిలుస్తుంద‌ట‌. ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. త‌దుప‌రి షెడ్యూల్ లో ఫైట్ మాస్ట‌ర్స్  రామ్ ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో ఎన్టీఆర్ పై యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here