Home Telugu
124
0

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రం మ‌నం. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున‌, నాగ చైత‌న్య క‌లిసి న‌టించిన ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని విశేషాద‌ర‌ణ పొందింది. తెలుగు సినిమాల్లో ఓ క్లాసిక్ గా నిలిచింది. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై అక్కినేని కుటుంబం నిర్మించిన మ‌నం అక్కినేని చివ‌రి చిత్రం కావ‌డం విశేషం. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న క‌థా చిత్రం రిలీజై నేటికి (మే 23)కి నాలుగేళ్లు అయ్యింది.

ఈ సంద‌ర్భంగా నాగార్జున ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ…మనం సినిమా రిలీజ్‌ అయి నాలుగేళ్లు అయ్యింది. నేనెప్పుడూ అదే ఆలోచిస్తుంటా.  మీరు మమ్మల్ని ఏడిపించి, నవ్వించి జీవితాన్ని చావును ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చారు. మేం ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తుంటాం నాన్న’ అంటూ ట్వీట్‌ చేశారు.  అలాగే అన్న‌పూర్ణ స్టూడియోస్ ట్విట్ట‌ర్ లో…మ‌నం సినిమా కోసం తీసిన..ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాని..ఓ స్టిల్ ను పోస్ట్ చేసారు. ఇందులో నాగ‌చైత‌న్య కారులోంచి దిగుతుంటే…కారు డ్రైవ‌ర్ గా నాగార్జున క‌నిపిస్తున్నారు. ఇక అక్కినేని దీర్ఘంగా ఆలోచిస్తున్న‌ట్టు ఉన్న స్టిల్ చూసి నెటిజ‌న్లు భ‌లే ఉంది అంటున్నారు.

మ‌రో విశేషం ఏమిటంటే…నాగార్జున న‌టించిన తొలి చిత్రం విక్ర‌మ్, అక్కినేని ఆఖ‌రి చిత్రం మ‌నం ఒకే రోజు (మే 23న) రిలీజ్ కావ‌డం విశేషం. ఈరోజు డేట్ అయిన 23ని తిర‌గేస్తే 32. నాగార్జునకి న‌టుడిగా 32 ఏళ్లు. ఈ సంద‌ర్భంగా త‌న‌ని ఎంత‌గానో అభిమానించి ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కాభిమానుల‌కు ధ్యాంక్స్ తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here