Home Telugu
95
0

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం తేజ్ ఐ ల‌వ్ యు. తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ ఇలా… రొమాంటిక్‌ మూవీస్‌ని అందించిన ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.  క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై  ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు, వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్యారిస్‌లో చిత్రీకరించిన రెండు పాటలతో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా ఎడిటింగ్‌, డబ్బింగ్‌ జరుగుతోంది. జూన్‌ 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. మంచి లవ్‌ ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రంగా ‘తేజ్‌ ఐ లవ్‌ యు’ రూపొందుతోంది. సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుందర్‌, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్‌ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here