Home Telugu
106
0

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందునున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రం గురించి ఎనౌన్స్ మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి…అటు అభిమానుల్లోను ఇటు ఇండ‌స్ట్రీలోను ఈ సినిమా ఎలా ఉండ‌బోతుంది..?  అస‌లు క‌థ ఏంటి..?  ఇలా ఎన్నో సందేహాలు.  తార‌క్, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ అన్న‌ద‌మ్ములుగా న‌టిస్తున్నార‌నీ..బాక్సింగ్ నేప‌ధ్యంలో సాగే క‌థ అని ఇలా ర‌క‌ర‌కాల క‌థ‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి.

ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ ప్ర‌చారంలో ఉన్న క‌థ కాదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…రాజ‌మౌళి తార‌క్, చ‌ర‌ణ్ ఇద్ద‌రికీ క‌థ చెప్పేందుకు రెడీ అవుతున్నార‌ట‌. ఫుల్ స్ర్కిప్ట్ రెడీ అవ్వ‌డంతో త్వ‌ర‌లోనే జ‌క్క‌న్న క‌థ చెప్ప‌నున్నార‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. చ‌ర‌ణ్ బోయ‌పాటితో సినిమా చేస్తుంటే…ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌వింద స‌మేత చిత్రంలో న‌టిస్తున్నారు. రాజ‌మౌళి ఈ సినిమాని అక్టోబ‌ర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇక ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ ని  2019లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here