Home Telugu
103
0

టాలీవుడ్ కింగ్ నాగార్జున – నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ నిర్మిస్తోన్న ఈ సినిమాని శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జున డాన్ గా న‌టిస్తుంటే…నాని డాక్ట‌ర్ గా న‌టిస్తున్నాడు. సార‌ధి స్టూడియోలో ప్ర‌త్యేకంగా రూపొందించిన కాల‌నీ సెట్ లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఇదిలా ఉంటే…ఈ మూవీ గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే…బాలీవుడ్ మూవీ జానీ గద్దర్‌ రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నార‌ని… 2007లో విడుదలై, విజయం సాధించిన‌ ఆ సినిమా కథను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు మార్పులు చేశారని. అయితే…ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై డైరెక్ట‌ర్  శ్రీరామ్‌ ఆదిత్య క్లారిటీ ఇచ్చారు. ట్విట్ట‌ర్ లో శ్రీరామ్ ఆదిత్య స్పందిస్తూ…‘వైజయంతి మూవీస్‌ పతాకంపై నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కుతోన్న  చిత్రం ఏ సినిమాకు రీమేక్‌ కాదు. అది ఒరిజినల్‌ స్క్రిప్ట్‌. క్లారిటీ ఇవ్వాలి అనిపించింది అంటూ త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు.

ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖ‌రారు చేయ‌లేదు. రిలీజ్ విష‌యానికి వ‌స్తే..ఈ మూవీని ఆగ‌ష్టులో రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే…తాజా స‌మాచారం ప్ర‌కారం వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here