Home Telugu
112
0

రామ్ ప్ర‌స్తుతం హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే సినిమా చేస్తున్నాడు. సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు న‌క్కిన త్రినాధ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే గ‌రుడ‌వేగ సినిమాతో స‌క్సస్ సాధించిన ప్ర‌వీణ్ స‌త్తారు తో సినిమా చేయాల‌నుకున్నాడు. రామ్ – ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్లో సినిమాని భ‌వ్య క్రియేష‌న్స్ అధినేత ఆనంద్ ప్ర‌సాద్ నిర్మించాలి అనుకున్నారు.

అయితే…యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందే ఈ సినిమాకి దాదాపుగా న‌ల‌భై కోట్లు అవుతుంద‌ట‌.  రామ్ తో భారీ బ‌డ్జెట్ మూవీ వ‌ర్కువుట్ కాద‌నే ఉద్దేశ్యంతో ఆనంద్ ప్ర‌సాద్ ఈ ప్రాజెక్ట్ కి నో చెప్పార‌ట‌. దీంతో ఈ మూవీని స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై స్ర‌వంతి ర‌వి కిషోర్ నిర్మించాలి అనుకున్నార‌ట‌. ఇక్క‌డ కూడా స్ర‌వంతి ర‌వి కిషోర్, ప్ర‌వీణ్ స‌త్తారుకు బ‌డ్జెట్ విష‌యంలో భేదాభిప్రాయ‌లు రావ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింద‌ని తెలిసింది.

రామ్ – ప్ర‌వీణ్ క‌లిసి ఈ మూవీ కాకుండా…మ‌రో క‌థ‌తో సినిమా చేద్దాం అనుకున్నార‌ట‌. మ‌రి…ప్ర‌వీణ్ స‌త్తారు రామ్ కోసం వేరే క‌థ రెడీ చేస్తాడా..?  లేక రామ్ కి చెప్పిన క‌థ‌తో వేరే హీరోతో సినిమా చేస్తాడా అనేది తెలియాల్సివుంది..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here