Home Telugu
101
0

మిర్చి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై…తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని.. ఆత‌ర్వాత శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను…ఇలా వ‌రుస‌గా బ్లాక్ బ‌ష్ట‌ర్స్ సాధిస్తోన్న‌సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో భ‌ర‌త్ అనే నేను సినిమాతో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో..కొర‌టాల నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది. అల్లు అర్జున్, అఖిల్, నాని..ఈ ముగ్గురిలో ఎవ‌రో ఒక‌రితో కొర‌టాల త‌దుప‌రి సినిమా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం…కొర‌టాల నెక్ట్స్ మూవీని మెగాస్టార్ చిరంజీవితో చేయ‌నున్నార‌ట‌. ఇటీవ‌ల చిరంజీవిని క‌లిసి కొర‌టాల క‌థ చెప్ప‌డం..చిరు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ట‌. అయితే..ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వ‌డానికి కార‌ణం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని టాక్ వినిపిస్తోంది. సందేశాత్మ‌కమైన క‌థ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి కొర‌టాల చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న ఈ సినిమాని త‌న క‌న్నా అన్న‌య్య చేస్తే బాగుంటుంద‌ని చెప్పి చిరంజీవి ద‌గ్గ‌ర‌కి పంపించార‌ట‌.

క‌థ విన్న చిరంజీవి బాగా న‌చ్చ‌డంతో సైరా కంప్లీట్ అయిన వెంట‌నే ఈ సినిమాని చేయాల‌నుకుంటున్నార‌ట‌. అయితే…సైరా పూర్త‌వ్వ‌డానికి టైమ్ ప‌డుతుంది. మ‌రి..అప్ప‌టి వ‌ర‌కు కొర‌టాల వెయిట్ చేస్తాడా..?  లేక ఈలోపు వేరే హీరోతో సినిమా చేస్తాడా..?  అనేది తెలియాల్సివుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here