Home Telugu
117
0

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు  నందమూరి తారక రామరావు వీర అభిమాని అయిన వై.వి.ఎస్.చౌద‌రి ఆ మహానటుడి తేజోరూపం పట్ల  ఆకర్షితుడై… తెలుగు సినీ రంగం లోకి ప్రవేశించి దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా, పంపిణీదారుడిగా మరియు ప్రదర్శనదారుడిగా  టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన అభిమాన హీరో ఎన్టీఆర్ ను మాస్ హీరోగా ఎలివేట్ చేసిన కె.రాఘవేంద్రరావు వద్ద  శిష్యరికం చేసారు. ఆత‌ర్వాత‌ రామ్ గోపాల్ వర్మ,  మహేష్ భ‌ట్ మరియు కృష్ణ వంశీ ల ద‌గ్గ‌ర‌  పనిచేసిన  అనుభవంతో, 1998 లో సీతారాముల క‌ళ్యాణం చూత‌ము రారండి సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు.

ఆత‌ర్వాత నాగార్జునతో  సీతారామ‌రాజు, మహేష్ బాబుతో ‘యువరాజు చిత్రాల‌ను తెర‌కెక్కించారు. ‘బొమ్మరిల్లు వారి’ అనే  బ్యానర్ స్థాపించి ‘లాహిరి లాహిరి లాహిరిలో .. అనే కుటుంబకథా చిత్రం తెర‌కెక్కించారు. ఈ చిత్రంతో వై.వి.ఎస్. చౌద‌రి  అంకిత, ఆదిత్య లను  టాలీవుడ్ కి పరిచయం చేసారు. మరోసారి  కొత్త హీరో, హీరోయిన్ రామ్, ఇలియానాలను టాలీవుడ్ కి ప‌రిచ‌యం చేస్తూ దేవ‌దాసు అనే సినిమాని అందించారు. బొమ్మరిల్లు వారి బ్యానర్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టిన చౌదరి నందమూరి బాలకృష్ణ హీరో గా ఒక్క మ‌గాడు చిత్రాన్ని స్వీయ‌ దర్శకత్వం లో తెర‌కెక్కించారు.

బొమ్మరిల్లు వారి బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ను హీరోగా పరిచయం చేసి ‘రేయ్’ చిత్రం తో మరో మాస్ హీరో ను టాలీవుడ్ కి పరిచయం చేసారు. ప్రస్తుతం మళ్ళీ కొత్త నటీనటులతో సినిమా చేసేందుకు సరికొత్త సబ్జెక్టు రెడీ చేస్తున్నారు వై వి యస్ చౌదరి. మ‌రి…కొత్త వాళ్ల‌తో చేయ‌నున్న ఈ సినిమా పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌చేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here