Home Telugu
133
0

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ – క‌బాలి ఫేమ్ రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ చిత్రం కాలా. ర‌జ‌నీకాంత్ అల్లుడు ధ‌నుష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ర‌జ‌నీ ముంబాయి డాన్ గా న‌టించారు. కాలా టీజ‌ర్ కి మంచి ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. ఇటీవ‌ల చెన్నైలో రిలీజ్ చేసిన‌ ఆడియోకు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. దీంతో సినిమా పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. జూన్ 7న కాలా చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్ధాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో భారీ స్ధాయిలో నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం హైదరాబాద్ ‘నోవాటెల్’ హోటల్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకను జరపనున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ స్థాయిలో విడుదల చేస్తోన్న ఈ సినిమాలో విల‌న్ గా నానా పటేకర్ న‌టించ‌డం విశేషం. ర‌జ‌నీకాంత్ – శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న రోబో సీక్వెల్ 2.0 కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నారు.

అయితే..రోబో సీక్వెల్ 2.0 రిలీజ్ కావ‌డానికి ఇంకా టైమ్ ప‌డుతుండ‌డంతో ఈలోపు కాలా రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఎప్ప‌టి నుంచో ర‌జ‌నీ సినిమా కోసం ఎదురుచూస్తోన్న అభిమానులు ఎప్పుడెప్పుడు జూన్ 7 వ‌స్తుందా..?   కాలా చిత్రాన్ని చూస్తామా..?  అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రి…ఎన్నో అంచ‌నాల‌తో వ‌స్తోన్న కాలా అంచ‌నాల‌ను అందుకుని స‌రికొత్త రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here