Home Telugu
114
0

ఒక విచిత్రం, మ‌లుపు, గుండెల్లో గోదారి, స‌రైనోడు, నిన్నుకోరి, అజ్ఞాత‌వాసి, రంగ‌స్థ‌లం…ఇలా డిఫ‌రెంట్ మూవీస్ లో డిఫ‌రెంట్ రోల్స్ చేస్తోన్న ఆది పినిశెట్టి హీరోగా హ‌రినాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఎం.వి.వి. సినిమాస్ బ్యాన‌ర్ లో కోన వెంక‌ట్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ఆది పినిశెట్టి స‌ర‌స‌న తాప్సి, గురు ఫేమ్ రితికా సింగ్ న‌టిస్తున్నారు. ఆది, తాప్సి కాంబినేష‌న్లో వ‌స్తోన్న రెండో సినిమా ఇది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి గుండెల్లో గోదారి సినిమాలో న‌టించారు.

ఈ సినిమాకు నీవెవరో అనే  టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌ పోస్టర్‌ను హీరో నాని ట్విట్ట‌ర్ లో రిలీజ్ చేసారు. ఆది కొత్త సినిమా టైటిల్‌ ‘నీవెవరో’. మా ప్రియమైన ‘అరుణ్‌’ నటిస్తోన్న‌ సినిమా టైటిల్‌ లోగోను ఆవిష్కరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. కోనవెంకట్ గారు.. తాప్సి, రితికా సింగ్‌కు ఆల్‌ ది బెస్ట్‌’ అని పేర్కొన్నారు. అనంతరం ఆదికి ట్వీట్‌ చేస్తూ..‘నువ్వు చెప్పిన స్టోరీ లైన్ కి ఈ టైటిల్ క‌రెక్ట్ బాబాయ్’ అని తెలియ‌చేసారు.

స‌రైనోడు, నిన్నుకోరి,  రంగ‌స్థ‌లం చిత్రాలు ఆది పినిశెట్టికి మంచి పేరు తీసుకువ‌చ్చాయి. ఇప్పుడు హీరోగా నీవెవ‌రో అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. మ‌రి…నీవెవ‌రో సినిమా ఆదికి ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందే చూద్దాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here