Home Movie Reviews
234
0

మాస్ మ‌హారాజా ర‌వితేజ – హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం నేల టిక్కెట్టు. ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న మాళ‌విక శ‌ర్మ న‌టించింది. నేల టిక్కెట్టు టైటిల్ & నేల‌ టిక్కెట్టు గాళ్ల‌తో పెట్టుకుంటే నేల నాకించేస్తారు అనే డైలాగును బ‌ట్టి ఈ సినిమా మాస్ ఆడియ‌న్స్ ని టార్గెట్ చేసి తీసార‌నిపిస్తుంది. అయితే…డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ మాత్రం కేవ‌లం మాస్ ప్రేక్ష‌కులే కాదు క్లాస్ ఆడియ‌న్స్ కి కూడా న‌చ్చేలా ఈ సినిమా ఉంటుంద‌న్నారు. దీనికి తోడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేల టిక్కెట్టు ఆడియోను రిలీజ్ చేయ‌డంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌నే పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ఇక ఈరోజు (మే 25న) నేల టిక్కెట్టు రిలీజైంది. మ‌రి…ర‌వితేజ నేల టిక్కెట్టుతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడా..?  సోగ్గాడే చిన్ని నాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన క‌ళ్యాణ్ కృష్ణ హ్యాట్రిక్ సాధించాడా..?   లేదా..?  అనేది తెలియాలంటే ముందుగా నేల టిక్కెట్టు క‌థ చెప్పాలి.

క‌థ – ఊరు పేరు లేని అనాధ నేల టిక్కెట్టుగాడు (ర‌వితేజ‌). ప్ర‌తి మ‌నిషిలో ఏదో రిలేష‌న్ వెతుక్కుంటాడు. ఆఖ‌రికి దేవుడితో కూడా.  ఎవ‌రికైనా క‌ష్టం వ‌చ్చింది అని తెలిస్తే చాలు స‌హాయం చేస్తుంటాడు. ఒక్కసారి ఎవ‌రితో అయినా క‌నెక్ట్ అయితే…వారి కోసం ఏం చేయ‌డానికైనా రెడీ అంటాడు.  కోర్టులో దొంగ సాక్ష్యాలు చెబుతూ…అడిగిన వారికి లేద‌న‌కుండా హెల్ప్ చేస్తూ ఫ్రెండ్స్ తో క‌లిసి హాయిగా బ‌తికేస్తుంటాడు. ఓసారి వైజాగ్ నుంచి హైద‌రాబాద్ వ‌స్తాడు. ఇదిలా ఉంటే….హైద‌రాబాద్ లో ఉండే హోమ్ మినిష్ట‌ర్ ఆదిత్య భూప‌తి (జ‌గ‌ప‌తిబాబు) కి డ‌బ్బంటే ప్రాణం. డ‌బ్బు కోసం ఏం చేయ‌డానికైనా రెడీ. ఆఖ‌రికి తండ్రి ఆనంద భూప‌తి (శ‌ర‌త్ బాబు)ని సైతం డ‌బ్బు కోసం చంపేస్తాడు. ఇలాంటి ఆదిత్య భూప‌తికి ర‌వితేజ షాక్ ఇస్తాడు. ఇక అక్క‌డ నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. డాక్ట‌ర్ మాళ‌విక‌తో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు.  ప్ర‌తి మ‌నిషిలో ఏదోక రిలేష‌న్ వెతుక్కునే ర‌వితేజ ఆఖ‌రికి ఓ కుటుంబాన్ని ఎలా సంపాదించుకున్నాడు..?  ఆదిత్య భూప‌తితో గొడ‌వేంటి..?   మాళ‌విక‌తో ప్రేమ ఫ‌లించిందా.?  లేదా..?  చివ‌రికి ఆదిత్య భూప‌తికి ఎలా బుద్ధి చెప్పాడు అనేది మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

ర‌వితేజ యాక్టింగ్

ముఖేష్ జి సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్

పాత క‌థ‌

లాజిక్స్ లేని స్ర్కీన్ ప్లే

కామెడీ లేక‌పోవ‌డం

సంగీతం

విశ్లేష‌ణ – హీరో అనాథ‌. చిన్ప‌ప్ప‌టి నుంచి అనాధాశ్ర‌మంలో పెర‌గ‌డం…ఆ అనాధాశ్ర‌మానికి ఓ స‌మ‌స్య రావ‌డం..చివ‌రికి ఆ స‌మ‌స్య‌ను హీరో ప‌రిష్క‌రించ‌డం అనేది బాగా అరిగిపోయిన పాత క‌థ‌. అలాగే రాజ‌కీయ నాయకుడు అస‌ల రంగు తెలియ‌చేసే వీడియో రిపోర్ట‌ర్ ద‌గ్గ‌ర ఉండ‌డం..ఆ వీడియో బ‌య‌ట‌పడితే త‌న ప‌ద‌విపోయే అవ‌కాశం ఉండ‌డంతో…ఆ వీడియో బ‌య‌ట‌కు రాకుండా ఉండేందుకు విల‌న్ ఎత్తులు పై ఎత్తులు వేయ‌డం..హీరో వాటిని ఎదుర్కొవ‌డం ఇవ‌న్నీ చాలా సినిమాల్లో చూసిన‌వే. అయితే… క‌థ పాత‌దే అయినా క‌థ‌నంలో కొత్త‌ద‌నం చూపిస్తూ ఇంట్ర‌స్టింగ్ గా చెప్ప‌చ్చు. ఇక్క‌డ ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకునేలా ఆస‌క్తిగా చెప్పే ప్ర‌య‌త్నం చేసారు కానీ…ఫ‌లించ‌లేదు.

డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ ఎమోష‌న్ సీన్స్ బాగానే రాసుకున్న‌ప్ప‌టికీ…ఆడియ‌న్స్ కి క‌నెక్ట్ కావ‌డం లేదు. ఎమ్మెల్యేను కొన‌డం అనే సీన్ ఉంది. అయితే..ఏదో కూర‌గాయ‌ల బేరం అడిన‌ట్టుగా చిత్రీక‌రించిన ఆ సీన్ చాలా కామెడీగా ఉంది. చుట్టు జ‌నం మ‌ధ్య‌లో మ‌నం, ముస‌లిత‌నం అంటే చేత‌కానిత‌నం కాదు నిలువెత్తు అనుభ‌వం..నేలా టిక్కెట్టు గాళ్ల‌తో పెట్టుకుంటే నేల‌..నాకించేస్తారు…ఇలా కొన్ని డైలాగులు మాస్ కి క‌నెక్ట్ అవుతాయి.  ఈ సినిమాకి ప్ల‌స్ అంటే ర‌వితేజ యాక్టింగే. త‌న‌దైన స్టైల్ లో న‌టించి న‌వ్వించాడు. త‌ను న‌టించిన ప్ర‌తి సీన్ లో ఎన‌ర్జి చూపించాడు. ఇక హీరోయిన్ మాళ‌విక శ‌ర్మ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు మ‌రోసారి విల‌న్ రోల్ లో త‌న పాత్ర‌కు న్యాయం చేసారు.  చాలా రోజుల త‌ర్వాత బ్ర‌హ్మానందం స్ర్కీన్ పై క‌నిపించారు. అయితే…బ్ర‌హ్మ‌నందం ఎందుకు ఈ పాత్ర చేసారో..?  అర్ధం కాదు.  ప్రియ‌ద‌ర్శి,  30 ఇయ‌ర్స్ పృథ్వీ, జ్యోతి, ర‌ఘుబాబు, పోసాని న‌వ్వించే ప్ర‌య‌త్నం చేసారు.  టోట‌ల్ గా నేల టిక్కెట్టు గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే…ర‌వితేజ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు.

రేటింగ్ 2.5/ 5

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here