Home Telugu
125
0

శ్రీకాంత్ న‌టించిన ఆప‌రేష‌న్ దుర్యోధ‌న చిత్రం విజ‌యం సాధించి…శ్రీకాంత్ కెరీర్ లో ఓ విభిన్న క‌థా చిత్రంగా నిలిచిన విష‌యం తెలిసిందే. ఓ వైపు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టిస్తూనే..మ‌రో వైపు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా శ్రీకాంత్ ఆప‌రేష‌న్ 2019 అనే సినిమా చేసారు. శ్రీకాంత్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అలివేలు నిర్మిస్తున్నారు. క‌ర‌ణం బాబ్జీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆప‌రేష‌న్ 2019 థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేసారు.

ఈ ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే…ఆప‌రేష‌న్ దుర్యోధ‌న సినిమా వ‌లే ఈ సినిమా కూడా పొలిటిక‌ల్ బ్యాక్ డ్రామాగా రూపొందుతోంది. తన కాలు నుంచి జారిన చెప్పును ఓ పోలీస్ ఆఫీసర్ తొడిగే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఆయన చెంపను శ్రీకాంత్ పగలగొట్టడం ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. అలాగే  గాంధీ కడుపున గాంధీ పుట్టడు .. ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు .. మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు .. ఎవరైనా ప్రజల్లో నుంచి పుట్టుకు రావలసిందే అంటూ శ్రీకాంత్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న సినిమా వ‌లే ఆప‌రేష‌న్ 2019 కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌నిపిస్తోంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here