Home Telugu
115
0

పూన‌మ్ కౌర్…ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచిన పేరు ఇది. క‌త్తి మ‌హేష్…పూన‌మ్ కౌర్, ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్..ఈ ముగ్గురి గురించి ఓ న్యూస్ ఛాన‌ల్ లో మాట్లాడ‌డం..అది వివాద‌స్ప‌దం అవ్వ‌డం తెలిసిందే. ఆత‌ర్వాత పూన‌మ్ కౌర్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ…ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు..న‌న్ను ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేయండి అంటూ త‌న బాధ‌ను వ్య‌క్తం చేసింది. రోజు వార్త‌ల్లో నిలుస్తూ వ‌చ్చిన ఈ వివాదం ఏరోజు ఏ మ‌లుపు తీసుకుంటుందో అనే ఆస‌క్తి క‌లిగించింది.

ఆఖ‌రికి ఈ వివాదం ముగిసింది అనుకుంటుంటే..ఇప్పుడు పూన‌మ్ కౌర్ చేసిన ట్వీట్స్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇంత‌కీ పూన‌మ్ ఏమ‌ని ట్వీట్స్ చేసారంటే…జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త .. నమ్మకద్రోహి అంటూ ఆమె చేసిన ట్వీట్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఆమె చేసిన ఈ ట్వీట్ లో రెండు సినిమా పేర్లను వాడటంతో ఆ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది చెప్ప‌క‌నే చెప్పింది. దీంతో ఈ విషయం మరింత వేడెక్కింది.

ఆ నాలుగు కుటుంబాలకు దగ్గరగా ఉండటం .. ఎన్నారై హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడం ఆ దర్శకుడికి అలవాటు. నాకు హిట్లు లేవనే సాకులు చెప్పి ఆ ఎన్నారై హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడు. మరి ఆ ఎన్నారై హీరోయిన్ కు హిట్లు ఉన్నాయా? ఆ ఎన్నారై హీరోయిన్లు మీరు చెప్పిన పనులు బాగా చేస్తారని విన్నాను.  అలాంటి ఉద్యోగాలు చేయకపోవడమే మంచిది” అంటూ ఆమె తన ట్వీట్ లో రాసుకొచ్చింది. పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్స్ కారణంగా ఆ దర్శకుడు ఎవరనే విషయంలో నెటిజన్లకు ఒక క్లారిటీ వచ్చేసింది. మ‌రి…ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో..?

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here