Home Telugu
110
0

ప‌వ‌న్ క‌ళ్యాణ్… అజ్ఞాత‌వాసి త‌ర్వాత సినిమాల‌కు గుడ్ బై చెప్పి..పూర్తి స్ధాయి రాజ‌కీయ నాయకుడుగా..త‌న టైమ్ అంతా జ‌న‌సేన పార్టీకే కేటాయిస్తున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే..మెగా ఫ్యామిలీ నుంచి ఎవ‌రు కూడా జ‌న‌సేన పార్టీలో చేరుతున్న‌ట్టుగానీ..ప్ర‌చారం చేస్తామ‌ని గానీ ఇప్ప‌టి వ‌రకు చెప్ప‌లేదు. ఇదిలా ఉంటే..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నారు.

ఇటీవ‌ల బ్యాంకాక్ లో షూటింగ్ జ‌రుపుకుని… హైద‌రాబాద్ వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్ మీడియాతో మాట్లాడుతూ…బాబాయ్ అడిగితే జనసేన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు తాను రెడీ అని తెలియ‌చేసారు. బాబాయ్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో కష్టపడుతుండటం చూస్తుంటే బాధగానే ఉంది కానీ, ప్రజల కోసం పర్యటిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.  ప్రజలు ఎంతగా బాధపడుతున్నారనే విషయాన్ని ఆయన గుర్తించారు. ప్రజల బాగు కోసం ఆయన వెళుతున్నారు కనుక మనం ప్రోత్సహించాలే తప్ప బాధపడకూడదు అన్నారు. మ‌రి..బాబాయ్ ప‌వ‌న్ అబ్బాయ్ చ‌ర‌ణ్ ని ప్ర‌చారం చేయ‌మంటారో లేదో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here