Home Telugu
136
0

టాలీవుడ్ కింగ్ నాగార్జున – సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్లో రూపొందిన తాజా చిత్రం ఆఫీస‌ర్. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున సిన్సియ‌ర్ & ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీసర్ గా న‌టించారు. నాగార్జున సరసన మైరా సరీన్‌ నటించ‌గా, బేజీ కావ్యా, ఫిరోజ్‌ అబ్బాసీ, షాయాజీ షిండే, అజయ్‌ తదితరులు కీలక పాత్ర పోషించారు. దాదాపు 25 ఏళ్లు త‌ర్వాత నాగ్ & వ‌ర్మ క‌లిసి సినిమా చేయ‌డంతో ఈ సినిమా పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

అయితే…ఈ సినిమా నిర్మాణంలో ఉండ‌గా వ‌ర్మ జీఎస్టీ, ప‌వ‌న్, శ్రీరెడ్డిల వివాదాలతో వార్తల్లో నిల‌వ‌డంతో ఆఫీస‌ర్ మూవీ పై వ‌ర్మ కాన్ స‌న్ ట్రేష‌న్  చేయ‌డం లేద‌నే టాక్ వ‌చ్చింది. దీనికి తోడు రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్నప్పటికీ డల్‌ ప్రమోషన్ల మూలంగా సినిమా పై బజ్‌ నెలకొనలేదు. పైగా అదే రోజు వేరే చిత్రాలు కూడా పోటీగా రిలీజ్‌ కాబోతున్నాయి. అందుకే ప్రమోషన్లకు వేగవంతం చేసే పనిలో పడ్డారు దర్శకుడు వర్మ. నాగ్‌ అభిమానులకు ఆహ్వానం అంటూ ఈనెల‌ 28న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించబోతున్నట్లు ట్విట్ట‌ర్ లో ఎనౌన్స్ చేసారు.

ఈనెల‌ 28న సాయంత్రం 7 గంటలకు ఎన్‌ కన్వెన్షన్‌లో ఆఫీస‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని, నాగ్‌ అభిమానులంతా ఆహ్వానితులేనని వర్మ ప్రకటించారు.  జూన్‌ 1న  ఆఫీసర్‌ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మ‌రి…ఆఫీస‌ర్ ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here