Home Telugu
112
0

నంద‌మూరి తార‌క రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్.టి.ఆర్ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ నిర్మిస్తోన్న‌ విషయం తెలిసిందే. ఇటీవ‌ల సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌డం..ఆత‌ర్వాత‌ డైరెక్ట‌ర్ తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి దర్శకుడు ఎవరనేది ఆస‌క్తిగా మారింది. దీంతో రాఘ‌వేంద్ర‌రావు, పి.వాసు, కృష్ణ‌వంశీ, పూరి జ‌గ‌న్నాథ్….ఇలా చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లు తెర పైకి వ‌చ్చాయి.

ఈ విషయమై జ‌రిగిన ప్ర‌చారానికి నందమూరి బాలకృష్ణ ఫుల్ స్టాప్ పెడుతూ…ఎన్టీఆర్ బ‌యోపిక్ గురించి అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. త‌న‌ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణికి దర్శకత్వం వహించిన క్రిష్ కు ఈ బాధ్యతలు అప్పగించినట్టు బాలకృష్ణ తెలిపారు. అంతేకాకుండా… ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. జనని భారత మెచ్చజగతి హారతులెత్త జనశ్రేణి ఘనంగా దీవించి నడుపగారణభేరి మ్రోగించే తెలుగోడు జయగీతి నినదించె మొనగాడు.. ఎన్.టి.ఆర్ ..అంటూ ఈ వీడియోలో బాలకృష్ణ వాయిస్ ఓవర్ చెప్పారు.

‘నాటి రామకథను ఆ రాముడి బిడ్డలైన లవకుశలు చెప్పారు. నేటి రామకథను ఈ రాముడి బిడ్డలమైన మేము చెబుతున్నాం. చేసే ప్రతి పనిలో ప్రాణముంటుంది. ప్రతి ప్రాణానికి ఒక కథ ఉంటుంది. ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది! నా నూరవ చిత్రాన్ని చరితగా మలిచిన క్రిష్ జాగర్లమూడి.. ఈ చరిత్రకు చిత్ర రూపాన్ని ఇస్తున్నారని ఆనందంతో తెలియజేస్తున్నాను. ఇది మా కలయికలో రెండో దృశ్య కావ్యం. మరో అఖండ విజయానికి అంకురార్పణ. నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది. మీ అందరి అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది. ప్రతి నిమిషం మీ కుశలాలు కాంక్షించే..మీ నందమూరి బాలకృష్ణ అని ఈ వీడియోలో బాలయ్య పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here