Home Telugu
113
0

తెలుగు సినిమా పరిశ్ర‌మ‌లో ప్ర‌వేశించి అప్ప‌టి వ‌ర‌కు వ‌స్తోన్న చిత్రాల‌కు భిన్నంగా ఎర్ర జెండాను హీరోగా మ‌లిచారు మాదాల రంగారావు. ఆయ‌న ఏ పరిస్థితిల్లోనూ తన సిద్ధాంతాలను విడవలేదు. ఎర్రజెండా గౌరవాన్ని తగ్గించలేదు. తను ఎలా ఉండాలనుకున్నాడో అలానే చివరి శ్వాస వరకు ఉన్నారు. ఆయ‌న‌ గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఈనెల 27న‌ తుది శ్వాస విడిచారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న భౌతికకాయాన్ని సంద‌ర్శించి నివాళుల‌ర్పించారు.

చిరంజీవి…హైదరాబాద్ లో మాదాల రంగారావు పార్థివ దేహానికి నివాళులర్పించి..వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ…నేను చెన్నైలో ఉన్నప్పటి నుంచి మాదాల రంగారావు గారితో పరిచయం ఉంది. నాతో ఎంతో స‌న్నిహితంగా ఉండేవారు. నా కెరీర్ ప్రారంభంలో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్లలో దర్శకుడు టి.కృష్ణ, మాదాల రంగారావు గారు కూడా ఉన్నారు. ఒంగోలులో నేను చదువుకున్న రోజుల నుంచి వారితో పరిచయం ఉంది.

దీంతో నాపై ఆయన ప్రత్యేక అభిమానం చూపించే వారు. ‘మనం ఒంగోలు నుంచి వచ్చామయ్యా! నువ్వూ అభివృద్ధిలోకి రావాలి.. మన ఒంగోలు పేరు నిలబెట్టాలి’ అని ఎంతో ఉత్సాహపరిచేవారు. ఒక కమిట్ మెంట్ తో విప్లవాత్మక సినిమాల్లోనే మాదాల నటించారు. కమర్షియల్ సినిమాల్లో నటించే అవకాశాలు ఆయనకు వచ్చినప్పటికీ తిరస్కరించారు.  ఈరోజున ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మాదాల మరణంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here