Home Telugu
109
0

అక్కినేని అఖిల్ తొలి చిత్రం అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో..రెండో సినిమా హ‌లో పై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ‌లో చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న‌ప్ప‌టికీ…క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం స‌క్సస్ సాధించ‌లేక‌పోయింది. దీంతో మూడ‌వ సినిమాతో ఎలాగైనా స‌రే…విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో అఖిల్ తాజా సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఫ‌స్ట్ షెడ్యూల్ ను లండ‌న్ లో ప్లాన్ చేసారు. స‌వ్య‌సాచి చిత్రంలో చైతు స‌ర‌స‌న న‌టించిన నిధి అగ‌ర్వాల్ ఈ సినిమా కోసం అఖిల్ స‌ర‌స‌న న‌టిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రానికి మిస్ట‌ర్ మ‌జ్ను అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావ‌చ్చు అంటున్నారు. గతంలో నాగార్జున మూవీ హలో బ్రదర్ నుంచి హలో.. టైటిల్ తీసుకున్న‌ అఖిల్, ఈసారి కూడా నాగార్జున హిట్ మూవీ అయిన మజ్ను టైటిల్ ను తీసుకుని దానికి ముందు మిస్టర్ ను యాడ్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి..ప్ర‌చారంలో ఉన్న ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారో..?   లేదో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here