Home Telugu
101
0

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ఎప్ప‌డూ ఏదో ర‌కంగా వార్త‌ల్లో ఉండే ఈ వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున‌తో వ‌ర్మ ఆఫీస‌ర్ మూవీని తెర‌కెక్కించారు. స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఆఫీస‌ర్ అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయ్యింది. జూన్ 1న ఆఫీస‌ర్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే… సినీ రంగంలోకి ప్రవేశించి రాణించాలనుకునే ఔత్సాహిక యువతీ యువకులకు సహాయపడి, వారికి కావాల్సిన శిక్షణ ఇచ్చేలా వర్మ ఫిల్మ్ స్కూల్ ను ప్రారంభించారు. నూతన టెక్నాలజీతో పాటు, డిఫరెంట్ మేకింగ్ ను ఇక్కడ నేర్పిస్తామని ఆయన అన్నారు. న్యూయార్క్ కు చెందిన డాక్టర్ రామ్ స్వరూప్, డాక్టర్ శ్వేతా రెడ్డిల సహకారంతో ఈ స్కూల్ ను ప్రారంభించామ‌ని చెప్పారు. దీనికి ‘ఆర్వీజీ అన్ స్కూల్’ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వర్మ తనను తాను వెండితెర ఉగ్రవాదిగా ప్రకటించుకున్నారు.

‘ఆన్‌స్కూల్‌ ద్వారా సినిమాకు సంబంధించి ఓనమాలు కూడా తెలియని వారికి శిక్షణ ఇస్తాం. యువతీ యువకుల అభిరుచిని బట్టి వివిధ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నాం. సినీరంగానికి సంబంధించి దాదాపు అన్ని విభాగాల్లోనూ శిక్షణ ఇస్తాం. మా స్కూళ్లో చేరాలంటే 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్నారు వర్మ. నా లాంటి ఉగ్రవాదులను తయారు చేసి పరిశ్రమలోకి వదలడమే లక్ష్యం అంటూ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. మ‌రి…ఆఫీస‌ర్ మూవీతో ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here