Home Telugu
98
0

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ… ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా ఓ సినిమా రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం నుంచి తేజ త‌ప్పుకున్న త‌ర్వాత చాలా మంది ద‌ర్శ‌కుల‌ను అనుకున్న‌ప్ప‌టికీ..ఫైన‌ల్ గా డైరెక్ట‌ర్ క్రిష్ కే బాధ్య‌త‌లు అప్ప‌గించారు. బాల‌య్య, క్రిష్ క‌లిసి గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా చేసారు. ఈ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ కి క్రిష్ ని ద‌ర్శ‌కుడిగా ఫైన‌ల్ చేయ‌డంతో స‌రైన నిర్ణ‌యం అంటూ  ప్రేక్ష‌కాభిమానులు, సినీ ప్ర‌ముఖులు బాల‌య్య‌ను అభినందిస్తున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…ఇటీవ‌ల జ‌రిగిన‌ మూవీ ప్రారంభోత్స‌వంలో ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. అయితే…ఇప్పుడు క్రిష్ మ‌ణిక‌ర్ణిక అనే సినిమా చేస్తున్నారు. ఇది పూర్తైన త‌ర్వాత ఈ సినిమాని ప్రారంభిస్తారు. దీంతో ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎప్పుడు సెట్స్ పైకి వ‌స్తుంది. ఎప్పుడు రిలీజ్ కానుంది అనేది చ‌ర్చినీయాంశం అయ్యింది. అయితే…తెలుగుదేశం పార్టీకి సంబంధించి జరుగుతున్న మహానాడులో పాల్గొన్న‌ బాలకృష్ణ  ఎన్టీఆర్ బ‌యోపిక్ రిలీజ్ విష‌య‌మై స‌స్పెన్స్ కి తెర దించుతూ…ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంద‌ని ప్ర‌క‌టించారు.

సంక్రాంతికి బాల‌య్య సినిమా రిలీజ్ అయితే…ఆ సినిమా హిట్టే. రీసెంట్ గా బాల‌య్య – క్రిష్ కాంబినేష‌న్లో వ‌చ్చిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా కూడా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం..విజ‌యం సాధించ‌డం తెలిసిందే. సో…సెంటిమెంట్ ప్ర‌కారం చూసుకున్నా..ఎన్టీఆర్ బ‌యోపిక్ సెన్సేష‌న్ క్రియేట్ చేసి విజ‌యం సాధించ‌డం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here