Home Telugu
170
0

సూపర్ స్టార్ రజినీకాంత్ – క‌బాలి ఫేమ్ రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ చిత్రం కాలా. ఈ భారీ చిత్రాన్ని వండ‌ర్ బార్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై హీరో ధ‌నుష్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. క‌బాలి చిత్రం ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో రోబో సీక్వెల్ 2.0 చిత్రాన్ని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా..? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే…2.0 రిలీజ్ కి ఇంకా టైమ్ ఉండ‌డంతో ముందుగా కాలా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. జూన్ 7న కాలా చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు.

ఈ సంద‌ర్భంగా కాలా ట్రైల‌ర్ ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. ఈ చిత్రంలో ర‌జినీ పేదల కోసం పోరాడే నాయకుడి పాత్రలో నటించారు. ముంబైలోని తమిళులు ఎక్కువగా ఉండే ధారవి ప్రాంతం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమాలో రజినీ కరికాలన్ గా కనిపించబోతున్నారు. అక్కడి తమిళలు నివసించే నేలను లాక్కోవడానికి రాజకీయ నాయకుడు చేసే కుట్రలను ఎదుర్కొనే ఒంటితల రావణుడిగా రజినీ తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారు.

ఆ విశ్వరూపం ఎలా ఉండబోతోందో సూచన ప్రాయంగా ట్రైలర్ ద్వారా చూపించారు. కాలా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా కాలా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం ఖాయం అనిపిస్తోంది. మ‌రి..ఏరేంజ్ స‌క్స‌స్ సాధిస్తుందో తెలియాలంటే జూన్ 7 వ‌ర‌కు ఆగాల్సిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here