Home Reviews
219
0

ఎస్.ఎం.ఎస్, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్, కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ, భ‌లే మంచిరోజు, శ‌మంత‌క‌మ‌ణి…ఇలా వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తోన్న సుధీర్ బాబు న‌టించిన తాజా చిత్రం స‌మ్మోహ‌నం. సుధీర్ బాబు, ఆదితిరావు హైద‌రి జంట‌గా న‌టించిన ఈ సినిమాని గ్ర‌హ‌ణం, అష్టా చ‌మ్మా, జెంటిల్ మ‌న్, అమీ తుమీ…ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించే అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించారు. శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్ పై శివలంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన‌ స‌మ్మోహ‌నం ఈరోజు (జూన్ 15)న రిలీజైంది. మ‌రి…స‌మ్మోహ‌నం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా..?  సుధీర్ బాబుకి స‌క్స‌స్ అందించిందా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాలి..!

క‌థ – విజ‌య్ (సుధీర్ బాబు) ఇప్పుడున్న కుర్రాల ఆలోచ‌న‌ల‌కు కాస్త భిన్నంగా ఆలోచిస్తుంటాడు. త‌న మ‌న‌సుకు న‌చ్చిన‌ట్టుగా చిన్న పిల్ల‌ల బొమ్మ‌లు వేసుకునే విజ‌య్ వాటినంత‌టిని ఓ పుస్త‌కం రూపంలో తీసుకురావాలి అనుకుంటాడు. సినిమాలంటే అస‌లు ఇష్టం ఉండ‌దు. స‌మీరా (ఆదితిరావు హైద‌రి) టాలీవుడ్ లో స‌క్స‌స్ ఫుల్ హీరోయిన్. విజ‌య్ తండ్రి శ‌ర్వా (న‌రేష్)కి సినిమాలంటే ఇష్టం.  న‌ట‌న అంటే పిచ్చి. అయితే…సినిమా షూటింగ్ కోసం ఇళ్లు కావాల‌ని న‌రేష్ ఇంటికి షూటింగ్ వాళ్లు వ‌స్తారు. ఇంకేముంది త‌న‌కు సినిమాలో న‌టించే ఛాన్స్ ఇస్తే…ఇంట్లో షూటింగ్ చేసుకోవ‌డానికి ప‌ర్మిష‌న్ ఇస్తానంటాడు. అవ‌కాశం ఇస్తామ‌న‌డంతో విజ‌య్ ఇంట్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక అక్క‌డ నుంచి విజ‌య్, స‌మీరా మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డ‌డం…ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ వ‌ర‌కు వెళ్ల‌డం జ‌రుగుతుంది. విజ‌య్ త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిస్తే…స‌మీరా నో అంటుంది. ఆత‌ర్వాత స‌మీరాకి ఓ స‌మ‌స్య ఉంద‌ని తెలుస్తుంది. ఇంత‌కీ ఆ స‌మ‌స్య ఏంటి..?  స‌మీరా స‌మ‌స్య‌ను విజ‌య్ ఎలా ప‌రిష్క‌రించాడు. ఆఖ‌రికి స‌మీరా విజ‌య్ ప్రేమ‌కు ఎస్ చెప్పిందా లేదా అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

సుధీర్ బాబు, ఆదితిరావు హైద‌రి న‌ట‌న‌

న‌రేష్ కామెడీ

పి.జి.విందా సినిమాటోగ్ర‌ఫీ

డైలాగ్స్, వివేక్ సాగ‌ర్ సంగీతం

మైన‌స్ పాయింట్స్..

అక్క‌డ‌క్క‌గా స్లోగా అనిపించ‌డం

విశ్లేష‌ణ – ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ సినిమా అంటే తెలుగుద‌నం ఉట్టిప‌డుతుంటుంది. ఆయ‌న‌కు తెలుగంటే ఇష్టం. అది ఆయ‌న ప్ర‌తి సినిమాలో క‌నిపిస్తుంటుంది. ఇందులోను క‌నిపించింది. స్టార్ హీరోయిన్ కి, సినిమాలంటే అస‌లు ఇష్టంలేని ఓ వ్య‌క్తి మ‌ధ్య జ‌రిగే ప్రేమ‌క‌థ ఇది. ఈ సినిమాకి ప్ల‌స్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సిందే సుధీర్ బాబు, ఆదితిరావు హైద‌రిల న‌ట‌న గురించే. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు ఇద్ద‌రు చాలా అద్బుతంగా న‌టించారు. చిన్న పాయింట్ ను తీసుకుని హాయిగా ఎంజాయ్ చేస్తూ చూసేలా డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు.

ఇక హైలెట్ అంటే శ‌ర్వా పాత్రే. సినిమాల‌న్నా, యాక్టింగ్ అన్నా..ప్రాణం ఇచ్చేంత ఇష్టం ఉన్న శ‌ర్వా పాత్ర‌లో న‌రేష్ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించారు. న‌రేష్ కెరీర్ లో మ‌రో మంచి పాత్ర‌. సినిమా వాళ్లు అంటే…జ‌న‌ర‌ల్ గా ఎలాంటి అభిప్రాయం ఉందో..హీరోయిన్ అంటే కొంత మంది ఏమ‌నుకుంటారో చెప్పే డైలాగులు చాలా స‌హ‌జంగా ఉన్నాయి. సెకండాఫ్ లో అక్క‌డ‌క్క‌డా కాస్త స్లో అయిన‌ట్టు అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గ‌తంలో మ‌నం ఎప్పుడో చూసిన‌ట్టే అనిపించినా…ఈ క‌థ‌ను ఇంట్ర‌స్టింగ్ తెర‌కెక్కించ‌డంలో ఇంద్ర‌గంటి స‌క్స‌స్ అయ్యారని చెప్ప‌చ్చు.

ప‌విత్రా లోకేష్, త‌నికెళ్ల భ‌ర‌ణి, హ‌రితేజ‌, అర్జున్ రెడ్డి ఫేమ్ రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు త‌మ పాత్ర‌ల ప‌రిథి మేర‌కు చాలా చ‌క్క‌గా న‌టించారు. ఇక టెక్నీషియ‌న్స్ విష‌యానికి వ‌స్తే…పి.జి.విందా సినిమాటోగ్ర‌ఫీ, వివేక్ సాగ‌ర్ సంగీతం, శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మాణం, ఇంద్ర‌గంటి సంభాష‌ణ‌లు..ఇలా ఒక‌టేమిటి అన్నీ బాగా కుదిరాయి. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే… ఫ్యామిలీ అంతా వెళ్లి హాయిగా చూసి ఎంజాయ్ చేసే రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ స‌మ్మోహ‌నం.

రేటింగ్ 3/5

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here