Home News 25 ఏళ్లు వెన‌క‌బ‌డిన ఆదోనిని ఒక్క అవ‌కాశం ఇస్తే..5 ఏళ్ల‌లో అభివృద్ధి చేసి చూపిస్తా –...

25 ఏళ్లు వెన‌క‌బ‌డిన ఆదోనిని ఒక్క అవ‌కాశం ఇస్తే..5 ఏళ్ల‌లో అభివృద్ధి చేసి చూపిస్తా – జ‌న‌సేన ఆదోని అసెంబ్లీ అభ్య‌ర్థి మ‌ల్ల‌ప్ప

135
0


ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌రుపున పోటీ చేసే అభ్య‌ర్ధుల పేర్ల‌ను జ‌న‌సేన పార్టీ ప్ర‌క‌టించింది. ఆదోని నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ త‌రుపున మ‌ల్ల‌ప్ప పోటీ చేయ‌నున్న‌ట్టు పార్టీ ఖ‌రారు చేసింది. దీంతో ఆయ‌న అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేసుకున్నారు. ఆదోనిలో ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటూ..మార్పు రావాలంటే జ‌న‌సేన పార్టీకి ఓటు వేయాలంటూ మ‌ల్ల‌ప్ప ప్ర‌చారంలో దూసుకెళుతున్నారు.

ఈ సంద‌ర్భంగా మ‌ల్ల‌ప్ప మాట్లాడుతూ… మా ఆరాధ్య దైవ్యం మ‌రియు నీతి, నిజాయితీ నిబ‌ద్థ‌త‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌టువంటి మా అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారికి మా కుటుంబం త‌రుపున ఆదోని నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల త‌రుపున హృద‌య పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియ‌చేసుకుంటున్నాం. విజ‌య‌వాడ జ‌న‌సేన ఆఫీస్ లో నాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు 5 నిమిషాలు మాట్లాడుతూ…ఆదోనిలో  అభిమానులు సైపాయిల వ‌లే బ‌లంగా ప‌ని చేస్తున్నారు.

అలాగే మీరు త‌ప్ప‌కుండా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి అక్క‌డ ఉన్న‌టువంటి మ‌త సామ‌ర‌స్యాన్ని కాపాడాలి. ఆదోని ప్ర‌జ‌లు ఎల్ల‌ప్పుడు సంతోషంగా ఉండే విధంగా మీరు బాధ్య‌త తీసుకోవాల‌ని ఆయ‌న చెప్ప‌డం జ‌రిగింది. ఆ క్ష‌ణంలో ప్ర‌జ‌ల ప‌ట్ల ఆయ‌న‌కున్న ప్రేమ క‌నిపించింది. ఆదోని ప్ర‌జ‌లు ఎంత‌గానో ఆద‌ర‌ణ చూపిస్తున్నారు. నా పై ఉన్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌ను. 25 ఏళ్లుగా వెన‌క‌బ‌డిన‌టువంటి ఆదోని నియోజ‌క‌వ‌ర్గాన్నిఒక్క అవ‌కాశం ఇస్తే..త‌ప్ప‌కుండా 5 ఏళ్ల‌లో అభివృద్ధి చేసి చూపిస్తాన‌ని ఈ సంద‌ర్భంగా హామీ ఇస్తున్నాను అని తెలియ‌చేసారు. 

ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాలు చూసిన‌ట్లైతే కేవ‌లం రెండు కుటుంబాల పరిపాల‌న మాత్ర‌మే 25 సంవ‌త్స‌రాల నుంచి న‌డుస్తుంది. ఆ రెండు కుటుంబాల ప‌రిపాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాలని ఆదోని నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు చాలా ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో జ‌న‌సేన పార్టీ ముందుకు రావ‌డం మంచి పరిణామం. ఆదోని గ‌డ్డ పై జ‌న‌సేన పార్టీ అత్య‌ధిక మెజార్టీతో గెల‌వ‌బోతుంది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here