Home News 25 సంవత్సరాల యువత భవిష్యత్తు కోసమే జనసేన పోరాటం — జనసేన నేత, మాజీ స్పీకర్...

25 సంవత్సరాల యువత భవిష్యత్తు కోసమే జనసేన పోరాటం — జనసేన నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్

54
0



  ఎన్నికల కోసం, పదవులు కాంక్షించి, పదవులు లేకపోతే బతకలేము అనే భావనతో జనసైనికులు లేరని, పాతిక సంవత్సరాలు యువతకు భవిష్యత్తు ఇవ్వడం కోసమే  జనసేన పోరాటం అని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శనివారం మన ఊరు మన మనోహర్ పర్యటనలో భాగంగా   21,  22,  23, 24, 35, 36,37 వ వార్డులలో  ఎన్నికల ప్రచారంనిర్వ‌హించారు. మ‌న ఊరు మ‌న మ‌నోహ‌ర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా 24వ వార్డులో  వై ఎస్ ఆర్ సి పి, టిడిపికి చెందిన 100 మంది  కార్యకర్తలు నాదెండ్ల మ‌నోహ‌ర్ అధ్వ‌ర్యంలో  జ‌న‌సేన పార్టీలో  చేరారు.వారికి మ‌నోహ‌ర్ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వ‌నించారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ…  యువతకు 25 సంవత్సరాల భవిష్యత్ ఇచ్చేందుకు జనసేన పార్టీ పోరాడుతుందని,. యువతికి భరోసా అండగా నిలబడేందుకు సమాజంలో మార్పు తీసుకువచ్చి అందరికీ సాయం అందించాలని లక్ష్యంతో ఉందన్నారు. ప్రభుత్వం ఒకరి కోసం, ఒక వర్గం కోసం కాదు అని. అందరిదీ ప్రభుత్వం అందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం పని చేసే విధంగా జనసేన పని చేస్తుందన్నారు. తెనాలి అభివృద్ధికి మంచి ప్రణాళిక ఉందని, జనసేన మేనిఫెస్టో జనసేన భావజాలము ప్రకారం సమాజములోని కిందిస్థాయి వారిని పైకి తీసుకు వచ్చి వారికి మంచి అవకాశాలు కల్పించాలని ఆలోచనే ఉందన్నారు.

10 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెనాలి ప్రణాళికతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు, ఏ కార్యక్రమం చేసినా వార్డుల్లో పర్యటించి ప్రజల పక్షాన వారి కోసం పని చేయడమే జరిగిందని గుర్తు చేశారు. ఈనాడు ప్రభుత్వ పనితీరులో అది స్పష్టంగా లోపించిందని కనబడుతుందన్నారు. నేడు  ప్రభుత్వం ప్ర‌జ‌ల‌ కష్టాలను పట్టించుకునే పరిస్థితిలో లేదన్నారు.  మన ఊరు మన మనోహర్ పర్యటనలో భాగంగా వార్డులో  పర్యటించినప్పుడు ప్రజలు బాగా ఆదరిస్తున్నారని. వారు ముందుకు వచ్చి గ‌తంలో   చేసిన అభివృద్ధిని గుర్తుచేసి మేము భవిష్యత్తులో చేసే ప‌నుల‌కు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

అమరావతి అభివృద్ధి తో పాటుగా చుట్టూప్ర‌క్క‌ల ఉన్నా పట్టణాల అభివృద్ధి పై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. సమాజ అభివృద్ధి కోసం జనసేన పార్టీ కోసం యువత మహిళలు బలంగా నిలబడ్డారన్నారు.  జనసేన విధానం ప్రజలకు సేవ చేయడమే అన్నారు. తెనాలి పట్టణానికి రహదారి, నీటి సదుపాయం ఉందని, మంచి ప్రణాళికతో అభివృద్ధి చేస్తే కచ్చితంగా తెనాలి విజయవాడ, గుంటూరుకు  దీటుగా అభివృద్ధి చెందుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here