Home Political News  28న మ‌హాకూట‌మి తొలి జాబితా విడుద‌ల‌..!

 28న మ‌హాకూట‌మి తొలి జాబితా విడుద‌ల‌..!

88
0

మ‌హా కూట‌మి గ‌త కొన్ని రోజులుగా సీట్ల స‌ర్ధుబాటు విష‌య‌మై చ‌ర్చ‌లు జ‌రుపుతుంది. కూట‌మిలోని పార్టీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. చంద్ర‌బాబు నాయుడు సీట్ల విష‌య‌మై ప‌ట్టింపులు వ‌ద్ద‌నీ..చెప్ప‌డంతో తెలంగాణ టీడీపీ నాయ‌కులు కాస్త త‌గ్గి ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని..ఫైన‌ల్ గా టీడీపీకి 15 స్ధానాలు ఖ‌రారు అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. 2014లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన అన్ని స్థానాలనూ టీడీపీ కోరుకుంటోందని సమాచారం.

స‌నత్ నగర్ ను కూడా టీడీపీ కోరుకుంటున్నప్పటికీ, కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అక్కడి నుంచి బరిలో దిగనున్నందున, దానికి బదులుగా సికింద్రాబాద్ ఇవ్వాలని తెలుగుదేశం కోరినట్టు తెలుస్తోంది. వీటితో పాటు ముషీరాబాద్, ఖైరతాబాద్ స్థానాలు కూడా తెలుగుదేశం ఖాతాలోకే వెళ్లినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే…ఈనెల 28న మ‌హాకూట‌మి తొలి జాబితాను విడుద‌ల చేయ‌నుంది. తొలి జాబితాలో కాంగ్రెస్ సీట్ల‌తో పాటు టీడీపీకి 6 సీట్లు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే 4 అసెంబ్లీ స్ధానాల్లో అభ్య‌ర్ధులు ఓకే చెప్పార‌ని తెలిసింది. టీజేఎస్, సీపీఐకి కూడా ఈ నెల 28న కొన్ని స్ధానాలు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here