Home Actor 3 నిమిషాల 27 సెక‌న్ల డైలాగ్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న సంపూ.

3 నిమిషాల 27 సెక‌న్ల డైలాగ్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న సంపూ.

77
0
3 నిమిషాల 27 సెక‌న్ల డైలాగ్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న సంపూ..! spiceandhra

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం కొబ్బ‌రి మ‌ట్ట‌. ఈ చిత్రానికి రూపక్‌ రొనాల్డ్‌ సన్‌  దర్శకత్వం వహించారు. స్టీవెన్‌ శంకర్‌ కథ అందించారు. నీలం సాయి రాజేష్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ నుంచి 3  నిమిషాల 27 సెకన్ల పాటు ఓ డైలాగ్ ను సంపూ చెప్పాడు. ఇంత పెద్ద డైలాగ్ ను సింగిల్ టేక్ లో, సింగిల్ షాట్ లో ఇంత వరకూ ఎవరూ చెప్పలేదని, ఇది ప్రపంచ రికార్డుగా చిత్ర యూనిట్ పేర్కొంది.

ఎవడిని చూడాలంటే మీ నవరంధ్రాలూ కళ్లుగా మారాలో వాడు రాబోతున్నాడు అంటూ ఈ వీడియో ప్రారంభమైంది. ఏరా పెద్దరాయుడు.. ఓరీ, ఓరోరి.. అంటూ ఆండ్రాయిడ్ పాత్రలో నటించిన సంపూ ఏకధాటిగా చెప్పిన డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంది.ఈ డైలాగ్ ను అద్భుతంగా చెప్పావ్ అంటూ సంపూను సినీ ప్ర‌ముఖులు అలాగే నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

ఆగ‌ష్టు 10న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హృదయకాలేయం అనే చిన్న సినిమాతో తనను ఆశీర్వదించి, ఆదరించిన ప్రేక్షకులందరూ ఆగస్టు 10న కొబ్బరిమట్ట సినిమాను ఆదరించాలని, ఆశీర్వదించాలని కోరాడు సంపూ. మ‌రి.. హృద‌య కాలేయంతో ఆక‌ట్టుకున్న సంపూ కొబ్బ‌రి మట్ట‌తో ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here